PM Modi inaugurates world's tallest statue of Unity సర్దార్ చొరవతో ఉపఖండంగా బాసిల్లుతున్న భారత్: ప్రధాని

Would need visa to see gir lions if it weren t for sardar patel says pm modi

gujarat goverment, Tourism, Statue of Unity, Sardar Vallabhbhai Patel, Nehru, India United, diverised India, Nationalism, Hyderbad, Gir lions, 562 sansthanas, sardar, PM Modi, Kevadiya, Narmada River, sardar sarovar dam, hyderabad, congress first depury prime minister, iron man of India, amit shah, national news

Sardar Vallabhbhai Patel united a diverse country like India and strengthen its bounding to be much more strong for centuries sais PM Modi. He alsg said that we should learn how to grow from strength to strength, how to always stay united.

సర్దార్ నిర్ణయాలతోనే ఉపఖండంగా బాసిల్లుతున్న భారత్: మోదీ

Posted: 10/31/2018 12:17 PM IST
Would need visa to see gir lions if it weren t for sardar patel says pm modi

భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ధైర్యంతో తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ ఇవాళ ఉపఖండగా బాసిల్లుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్థార్ వల్లభభాయ్ పటేల్ 143 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ప్రధాని ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ చోరవతో ఇవాళ దేశీయ సంస్థానాలన్నీ దేశంలో విలీనం కాగలిగాయని అన్నారు. కు ప్రధాని ఘన నివాళులు అర్పించారు. బీజేపీ చీఫ్ అమిత్‌ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో సాధు బెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ అవిష్కరణతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని కూడా గుర్తింపును పోందింది. దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టనుంది. ఈ విగ్రహ నిర్మాణంతో గుజరాత్ లోని సర్థార్ సరోవర్ డ్యామ్ తో పాటు నర్మదా జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దనున్నారు. 2013 అక్టోబర్‌ 31 గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

సర్థార్ వల్లభబాయ్ పటేల్ సాహసోపేత నిర్ణయాలు దేశాన్ని ఐక్యంగా నిలపాయని ప్రధాని అన్నారు. ఆయన చోరవ చూపకుండటే గుజరాత్ లోని గిర్ సింహాలను చూడటానికి, సోమనాథ్ ఆలయాన్ని, హైదరాబాద్ లోని చార్మినార్ ను సందర్శించడానికి కూడా భారతీయులు వీసా తీసుకోవాల్సి వచ్చేదని ప్రధాని అన్నారు. పటేల్ దూరదృష్టి, తెలివితేటల కారణంగానే దేశంలో 562 స్వదేశీ సంస్థానాలను విలీనం చేయగలిగారని.. దేశం మొత్తం గర్వించేలా సర్థార్ నిర్ణయాలు తీసుకున్నారని ప్రధాని ప్రశంసించారు.

సర్దార్ పటేల్ పనిచేయకుంటే సివిల్ సర్వీస్ లో సంస్కరణలు ఉండేవి కాదని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసీఎస్)లో స్వాతంత్ర్యం తర్వాత తొలి హోంమంత్రి పటేల్ సంస్కరణలు చేపట్టారని ప్రధాని వెల్లడించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైల్వే లైన్ సరిగ్గా వుందంటే.. దానికి కూడా కారణం సర్దార్ వల్లభబాయి పటేల్ అని ప్రధాని కొనియాడారు. పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు.

దేశవిభజన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్ వ్యవస్థను కూడా గాడిలో పెట్టి నూతన సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత అయనదేనని ప్రధాని ఊటంకించారు, దాంతో పాటు ఇతర కేంద్ర సర్వీసులను కూడా సర్దార్ పటేల్ గాడిలో పెట్టారన్నారు. పంచాయితీ ఎన్నికల్లో మహిళలు పోటీచేసేలా పటేల్ చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles