Swine flu results in five deaths in Hyderabad,నగరవాసులకు హెల్త్ అలెర్ట్: విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

Deaths due to swine flu pose concern in hyderabad

h1n1, hyderabadis, health alert, hospitals, swine flu, deaths, Ramesh Reddy, Medical Education Director, h1n1, Osmania General Hospital, Gandhi General Hospital, Swine Flu kits, telangana goverment

In a major development, the menace of swine flu claimed as many as five deaths in Hyderabad. The deaths have come about over past fortnight. It emerged that the cases of swine flu are increasing in the city, also confirmed by local medical sources.

నగరవాసులకు హెల్త్ అలెర్ట్: విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

Posted: 10/18/2018 07:00 PM IST
Deaths due to swine flu pose concern in hyderabad

రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా వుండాలని తెలంగాణ వైద్య, అరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వైన్‌ప్లూ వేగంగా విస్తరిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మధుమేహంతో బాధపడుతున్న వృద్ధులు, రక్తపోటు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులున్న వారు అత్యంత జాగ్రత్తగా వుండాలని సూచించింది.

ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వైన్ ఫ్లూ త్వరగా సోకే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వ్యాధితో బాధపడుతూ ఇప్పటి వరకే ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే గడిచిన అగస్టు మాసం నుంచి ఇప్పటి వరకు 11 మంది ఈ వ్యాధి భారిన పడి మరణించారని కూడా వెల్లడైంది. ఈ నేపథ్యంలో నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయని రాష్ట్ర వైద్యవృత్తి డైరెక్టర్ రమేష్ రెడ్డి అప్రమత్తంగా వుండాలని ప్రజలను సూచించారు. నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

స్వైన్ ఫ్లూ అనేది H-1 N-1 వైరస్. ఇది భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉంది. ఒక వ్యక్తికి హెచ్1 ఎన్ 1 వైరస్ సోకితే.. ఆ వ్యక్తి నుంచి వేరే వారికి గాలి, నీరు, ఇలా అనేక విధాలుగా ఇది సోకుతుంది. కాబట్టి నగరవాసులు బయటకు వెళ్లేటప్పుడు నోటికి మాస్కులు ధరించాలి. ఇతరులతో కరచాలనం (షేక్ హ్యాండ్) చేయకూడదు. దగ్గినా, తుమ్మినా వెంటనే చేతులు కడుక్కోవాలి. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడం మంచిది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. వంటి లక్షణాలుంటే దానిని స్వైన్‌ఫ్లూగా అనుమానించవచ్చు. ఇవి తీవ్రమైతే వెంటనే వైద్యులను స్పందించాలి. ఆలస్యం చేయడం వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్ల వచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : h1n1  hyderabadis  health alert  hospitals  swine flu  deaths  Ramesh Reddy  Medical Education Director  

Other Articles