kanaka-durga-devi-in-two-alankarams-today మహిషాసురమర్థిని.. రాజరాజేశ్వరిగా.. దుర్గమ్మ

Navaratri fest concludes today kanaka durga devi in two alankarams today

Kanaka Durga temple, durgadevi, teppostavam, Dasara festival celebrations, Vijayawada, Rajarajeswari devi, mahishasuramardini, Gayatri devi, Navaratri fest, indrakeeladri, Alampur

Devi Sharad Navaratri festival concludes today at Kanaka Durga devi atop Indrakeeladri hills and in telugu states as Durga Devi today to bless devotees in two avatars in the morning as mahishasura vardhini and in the evening as rajarajeshwari devi.

నేడే విజయదశిమి.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరిగా.. దుర్గమ్మ

Posted: 10/18/2018 12:20 PM IST
Navaratri fest concludes today kanaka durga devi in two alankarams today

ఇంద్రకిలాద్రిపై గత ఎనమిది రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోన్న కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇశాళ సాయంత్రం అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు అభయప్రధానం చేసిన తరువాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. అయితే ఇవాళ అమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులకు కనువిందుగా దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం మహర్నవమి కారణంగా అమ్మవారు మహిషాసుర మర్థిని అవతారంలో.. సాయంత్రం విజయదశమి కారణంగా రాజరాజేశ్వరి అవతారంలో కనకదుర్గమ్మ రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ రెండు తిధులు అత్యంత అరుదుగా రావడం గమనార్హం. అయితే భక్తులు మాత్రం ఇలా కలసిరావడం అదృష్టంగా భావించి అమ్మవారిని దర్శనం కోసం బారులు తీరారు. ఇవాళా మధ్యాహ్నం 2-07 గంటలకు దశమి ఘడియలు ప్రారంభం కావడంతో ఉదయం 11 గంటల వరకు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం 11 నుంచి 1 గంట వరకు దర్శనం నిలిపివేసి రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. రాత్రి 11 గంటల వరకు ఈ అలంకారంలో అమ్మవారు అనుగ్రహిస్తారు.

చిత్తా నక్షత్రంతో శరన్నవరాత్రులు ప్రారంభించి, శ్రవణా నక్షత్రంతో ముగించే సంప్రదాయం కనకదుర్గ ఆలయంలో కొనసాగుతోంది కాబట్టి గురువారం శ్రవణా నక్షత్రం ఉన్నందున ఆ రోజునే దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం జరిగే తెప్పోత్సవంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు చేరుకున్నట్లే. రెండు రూపాల్లో అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయం దర్శనం నిలిపివేసి, రూ.100, రూ.300 టిక్కెట్ల విక్రయం కూడా రద్దుచేశారు. క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, పులిహోర, కదంబం, మంచినీళ్లు అందజేస్తున్నారు. కొండపై రద్దీని తగ్గించేందుకు కృష్ణ‌వేణి ఘాట్లో కేశఖండన శాలను ఏర్పాటుచేశారు. అర్జున వీధి చివరిలో ప్రసాద విక్రయం కేంద్రం, అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. అయితే భద్రాచలం సీతారామస్వామి దేవాలయంలో మాత్రం శుక్రవారమే విజయ దశమి వేడుకలు నిర్వహిస్తారు.

ఇక తెలుగు రాష్ట్రాలలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో విజయ దశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. ఇక విజయదశమి పర్యదినాన్ని పురస్కరించుకుని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతున్నాయి. సాయంత్రం షమీ పూజ నిర్వహణ అనంతరం అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో అలాయ్ భలాయ్ తీసుకుని పండుగను ఘనంగా జరుపుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles