MJ Akbar resigns as minister ఎట్టకేలకు మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా

Metoo mj akbar resigns 10 days after sexual harassment allegations

MJ Akbar resignation, MJ Akbar resigns, MJ Akbar, MJ Akbar resignation statement, union cabinet, ministry, resignation, #MeToo, MeToo, Priya Ramani, sexual harassment, politics

MJ Akbar, Minister of State for External Affairs, has tendered his resignation from the cabinet ten days after senior journalist Priya Ramani accused him of sexual harassment and predatory behaviour.

ఎట్టకేలకు మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా

Posted: 10/17/2018 05:15 PM IST
Metoo mj akbar resigns 10 days after sexual harassment allegations

‘మీటూ’ ఉచ్చులో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్.. తనపై వస్తున్న అరోపణలను తోసిపుచ్చినా.. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. తనపై తొలుత లైంగిక అరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై న్యాయపోరాటానికి సిద్దపడిన ఆయన.. తనపై రోజురోజుకు మహిళా జర్నలిస్లుల నుంచి అరోపణలు ముంచెత్తుతుండటంతో.. చేసేది లేక తన పదవి నుంచి తప్పుకున్నారు.

ది ఏసియన్‌ ఏజ్ లో సంపాదకులుగా పని చేసిన సమయంలో అక్బర్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ పలువురు మహిళా జర్నలిస్టులు ఆయనపై ఆరోపణలు చేశారు. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా పాత్రికేయురాలు ప్రియా రమణి తొలిసారిగా అక్బర్ పై ఆరోపణలు చేశారు. ఆమె తర్వాత మరుసటి రెండు రోజులకు ఆ సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ క్రమంలో రమణిపై న్యాయపోరాటానికి అక్భర్ సిద్దం కాగానే ఆ సంఖ్య నేటికి 17కు చేరింది.

ఈ 17 మంది మహిళా జర్నలిస్టులు అక్బర్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపణలు గుప్పించారు. తనపై కావాలని నిరాధార అరోపణలు చేస్తున్నారని, ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కావాలనే ఇలాంటి అరోపణలు గుప్పించి.. తన పరువు మర్యాదలతో అడుకుంటున్నారని అయన పేర్కోన్నారు. ఇక తనపై తొలిసారిగా అరోపణలు గుప్పించిన ప్రియా రమణిపై న్యాయపోరాటానికి కూడా సిద్దమైన అక్బర్..  అమెపై పాటియాల న్యాయస్థానంలో పరువు నష్టం దావా కూడా వేశారు.

అన్ని అరోపణలను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేసిన ఆయన మూడు రోజుల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కాగా, ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై ఆయన పరువునష్టం దావా వేశారు. ఇప్పటి వరకు అక్బర్ పై 15 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా తుషితా పటేల్ అనే మరో మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MJ Akbar  union cabinet  ministry  resignation  #MeToo  Priya Ramani  sexual harassment  politics  

Other Articles