Damodara Raja Narasimha wife joins BJP దామోదర రాజనర్సింహ భార్య బీజేపిలోకి..!

Shocking damodara raja narasimha wife padmini reddy joins bjp

damodara rajanarsimha, Padmini Reddy, BJP, Congress, swami paripoornananda, amit shah, deputy CM, Telangana, Politics

C Padmini Reddy, the wife of Telangana Congress Election Manifesto committee chairman Damodar Raja Narasimha, has joined BJP today

కాంగ్రెస్ కు షాక్: దామోదర రాజనర్సింహ భార్య బీజేపిలోకి..!

Posted: 10/11/2018 05:07 PM IST
Shocking damodara raja narasimha wife padmini reddy joins bjp

సరిగ్గా ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం కూడా లేని తరుణంలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై అమె గత మూడు పర్యాయాలుగా గురిపెట్టారు. అయితే కాంగ్రెస్ తో అది సాధ్యం కాదని భావించారో ఏమోకాని అమె ఏకంగా బీజేపి తీర్థం పుచ్చుకుని కాషాయ కండువాను కప్పుకున్నారు.

అయితే అమె చేరిక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న దామోదర రాజనర్సింహకు.. పద్మినీ రెడ్డికి మధ్య ఎలాంటి విభేధాలు కూడా లేవని సమాచారం. అలాంటప్పుడు అమె భర్త పార్టీని కాదని బీజేపిలోకి ఎందుకు చేరారన్న విషయమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే పద్మినీరెడ్డి బీజేపీలో చేరేందుకు అసలు కారణాలు మాత్రం వేరుగా వున్నాయని తెలుస్తోంది.
 
పద్మినీరెడ్డి చేరికకు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన పరిపూర్ణానంద పలు రాజకీయ పరమైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తనకు శిష్యులుగా ఉన్న కొంతమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఓ జాబితాను సిద్ధం చేసి దాన్ని అమిత్‌షాకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పద్మినీరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అమిత్‌‌షాకు పరిపూర్ణానంద తెలియజేసినట్లు సమాచారం.

పద్మినీరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించడంతోనే ఇవాళ ఆమె కాషాయ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. పద్మినీరెడ్డి సంగారెడ్డి లేదా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే గత రెండు దఫాలుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు పద్మినీరెడ్డి ఆసక్తి కనబరిచారు. దామోదర రాజనర్సింహకు ఆంధోల్ టికెట్ కేటాయించడంతో.. ఆయన భార్యకు సంగారెడ్డి టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించింది.

ఇక దీనికి తోడు సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మాత్రమే సమర్థ అభ్యర్థిగా కాంగ్రెస్ భావించింది. ఈసారి కూడా ఆయనకే టికెట్ కేటాయించింది. దీంతో సంగారెడ్డి నుంచి పోటీ చేయాలనే ధృఢ నిశ్చయంతో ఉన్న పద్మినీరెడ్డి... కాంగ్రెస్ నుంచి అలాంటి అవకాశం లేకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తనకు టికెట్ ఇస్తుందనే ఆశాభావంలో పద్మినీరెడ్డి ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు జగ్గారెడ్డి కూడా ముందు బీజేపీ నుంచే సంగారెడ్డి మున్సిఫల్ చైర్మన్ సీటును కైవసం చేసుకున్న విషయం కూడా తెలిసిందే. దీంతో తిరిగి కమలం పార్టీ బలాన్ని వినియోగించుకుని తాను ఎన్నికల బరిలో నిలవాలని పద్మినీ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తుంది. కాగా, దామోదర రాజనర్సింహ అనుమతితోనే పద్మినీరెడ్డి బీజేపీలో చేరారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles