HC directs Telangana govt. to hold panchayat elections మూడు నెల్లలోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలి: హైకోర్టు

Hc directs state govt to hold panchayat elections in 3 months

Telangana, Panchayat Elections, High Court, Hyderabad, Telangana Panchayat Elections, special officets,Gram Panchayat elections

The Hyderabad High Court on Thursday has ordered the state government to hold Panchayat elections within three months. The HC passed the orders pertaining to the petition filed in the court against appointing the special officers to Gram Panchayat.

మూడు నెల్లలోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలి: హైకోర్టు

Posted: 10/11/2018 01:33 PM IST
Hc directs state govt to hold panchayat elections in 3 months

తెలంగాణలో ప్రస్తుతం కోనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన రాజ్యాంగ విరుద్దమని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో నేటి నుంచి మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వ అధికారుల పాలన ఎలా కోనసాగిస్తారని ప్రశ్నిస్తూ పలు ఫిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.

పంచాయితీల గడువు మగిసిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను పాలన సాగిస్తున్నారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి విచారించిన న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పంచాయతీలకు మూడు నెలల్లోగా అనగా జనవరి 11లోగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
 
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడం, ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంపై న్యాయస్థానం తప్పుబట్టింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని.. ఎన్నికల ప్రక్రియ వారి ద్వారానే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అని.. వివిధ కారణాలతో వాటిని వాయిదా వేయడం మంచి పద్ధతి కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Panchayat Elections  High Court  Hyderabad  Telangana Panchayat Elections  

Other Articles