Nadendla Manohar to join JanaSena జనసేనలోకి నాదేండ్ల మనోహర్..

Nadendla manohar to join pawan kalyan s janasena today

pawan kalyan, janasena, nadendla manohar, tirupati, congress, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Former speaker and senior congress leader nadendla manohar to join Jana Sena party today in tirupati in the presence of actor turned politician and Jana Sena cheif pawan kalyan.

జనసేనలోకి మాజీ స్పీకర్ నాదేండ్ల.. కాంగ్రెస్ కు రాజీనామా

Posted: 10/11/2018 01:11 PM IST
Nadendla manohar to join pawan kalyan s janasena today

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ అంతకంతకూ తమ ఉనికిని చాటుకుంటూ బలోపేతం అవుతుంది. ఇన్నాళ్లు బలమైన నాయకగణం లేదన్న విమర్శలపై మిన్నకుండిన పార్టీ అధినేత జనసేనాని పవన్ కల్యాణ్.. తన పార్టీలో చేరుతున్న నాయకుల జాబితాతోనే విమర్శకులకు సమాధానం ఇస్తున్నారు. ఓ వైపు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటూ మరోవైపు మంచి నాయకులను సమీకరించుకుంటూ జనసేన ముందుకుసాగుతుందని ఆ పార్టీ వర్గాలు చెప్పిన మాటలు వాస్తవరూపం దాల్చుతున్నాయి.

ఇప్పటికే వామపక్ష పార్టీలతో కలసి ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేనకు అటు యువత నుంచి కూడా పెరుగుతున్న ఆదరణతో ఎన్నికల సమయానికి మరింత పటిష్టంగా తయారై అధికార, విపక్ష పార్టీలకు దిమ్మదిరిగేలా బదులిస్తుందని కూడా జనసేన వర్గాలు, పవన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు వ్యాపారం కాదని, ప్రజలకు సేవ చేసే మహాభాగ్యమని.. ఆ అవకాశాన్ని ప్రస్తుతం అధికార, విపక్ష పార్టీలు స్వార్థానికి వినియోగ పర్చుకుంటున్నాయని తమ అధినేత అవేదన చెందుతున్నారని కూడా ఆయా వర్గాలు పేర్కోంటున్నాయి. ఫలితంగా ప్రజలకు మేలు జరగడం లేదని అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రత్యేక్ష పోరులోకి తొలిసారి బరిలోకి దిగుతున్న జనసేనకు నాయకులు ఒక్కొక్కరి నుంచి మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత పంతం నానాజీ రెండు నెలల క్రితమే జనసేనలో చేరారు. కాగా తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ శాసససభ సభాపతి నాదేండ్ల మనోహర్ కూడా జనసేనలో చేరనున్నారు. ఇవాళ తిరుపతిలో ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ ఆద్వర్యంలో ఆయన పార్టీ తీర్దం పుచ్చుకోనున్నారు.

జనసేన పార్టీలో చేరికపై ఇప్పటికే నాలుగు నెలల క్రితం జూన్ 23న పవన్ కల్యాణ్ ను కలసిన నాదేండ్ల ఆయన వద్ద నుంచి అనుమతిని తీసుకున్నారని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని నెలల వరకు చేరికలపై పవన్ కల్యాణ్ ఎవరికీ స్పష్టత ఇవ్వలేదని, దీంతో ఇవాళ ఆయన జనసేనలో చేరుతున్నారని సమాచారం. ఇక జనసేన పార్టీలో చేరిక సందర్భంగా ఆయన తన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తిరుపతికి బయలుదేరారు. నాదేండ్ల మనోహర్ ను పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  nadendla manohar  tirupati  congress  andhra pradesh  politics  

Other Articles

 • Actress and director vijaya nirmala is no more

  ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

  Jun 27 | అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో... Read more

 • Demolition of praja vedika

  ప్రజావేదిక కూల్చివేత...

  Jun 26 | ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల... Read more

 • Netizens trolls on ongole gang rape case

  ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

  Jun 24 | ఒంగోలులో 16ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ... Read more

 • Kia unveils seltos in india packs it with premium features

  అనంతపురం కియా మోటార్స్ నుంచి తొలి ఎస్.యూ.వీ

  Jun 20 | సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్‌యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్‌తో పాటు విడుదల... Read more

 • Telugu content

  రాంగ్ పార్కింగ్ వాహనదారులకు ఇకపై షాక్..!

  Jun 20 | మీరు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారా ? అయితే జేబుకు చిల్లు పడినట్లే. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా..నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రూ. 10 వేల... Read more

Today on Telugu Wishesh