ఓటర్ల జాబితా అవకతవకల పిటిషన్ పై ఈ నెల 8నే విచారణ చేపట్టాలని దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో ఓటరులిస్లు అక్రమాలపై అదే రోజున న్యాయవాది జంద్యాల రవిశంకర్ సహా సీనియర్ కాంగ్రెస్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్లపై తదుపరి విచారణను ఇవాళ కోనసాగించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు.. విచారణ జరిపింది. ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడెపిట్ దాఖలు చేయడంతో ఇరువైపుల నుంచి వాదప్రతివానలు కొనసాగాయి.
పిటిషన్ లోని ఒక్క అంశం కూడా చెల్లదని ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు వాదించింది. పిటిషనర్ సమర్పించిన జాబితాలో తప్పులు ఉన్నాయని, 2016-17 ఓటర్ల లిస్టు ఇప్పుడు చూపిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తామనంటూ ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఒకే అడ్రస్‌తో వేల ఓట్లు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈసీ వెబ్ సైట్ నుంచి తీసుకుని కోర్టుకు జాబితా సమర్పించామని చెప్పారు.
బోగస్ ఓట్లను ఎలా తొలగిస్తారు? తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఓటరు నమోదు ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఓటరు నమోదుకు ఎలాంటి ప్రాతిపదికలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. వీటన్నింటిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఈసీకి చీఫ్ జస్టిస్ ఆదేశించారు. ఓటర్ల జాబితా బూత్ స్థాయి లిస్టు ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
అలాగే ఈనెల 12న ఓటర్ లిస్ట్ ప్రకటించుకోవచ్చని పేర్కొంటూ.. తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదా వేసింది. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్డును విడుదల చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం అంత తొందరపాటు నిర్ణయం తీసుకోవడమేంటని, ఇక అసెంబ్లీలో సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు నామమాత్రం కూడా సమాచారం లేకుండా మంత్రిమండలి ఏకపక్షంగా అసెంబ్లీ రద్దుకు ఎలా వెళ్తుందని ప్రశ్నిస్తూ డీకే అరుణ, శశాంక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువైపులా వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
(And get your daily news straight to your inbox)
Feb 18 | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 10 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 21న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల... Read more
Feb 18 | ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అంగడి జ్యోతి హత్యకేసులో అది నుంచి ప్రియుడిపైనే అనుమానం వ్యక్తం చేసిన జ్యోతి సోదరుడి అరోపణలే నిజమయ్యాయి. ఈ హత్యకేసులో జ్యోతి ప్రియుడు చెంచు శ్రీనివాస్ పథకం ప్రకారమే... Read more
Feb 18 | టాలీవుడ్ హీరో, స్వర్గీమ విప్లవాత్మక డైరెక్టర్ టి కృష్ణ తనయుడు గోపీచంద్ కు ప్రమాదం సంభవించింది. స్వతహాగా రిస్క్ సీన్లను కూడా డూప్ లు లేకుండా తామే తీస్తున్న తెలుగు యువహీరోలలో గోపిచంద్ కూడా... Read more
Feb 18 | పుల్వామా సమీపంలోని అవంతిపురాలో జాతీయ రహదారిపై విధులకు హాజరవుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి వెనుకనున్న మాస్టర్ మైండ్, ఐఈడీ నిపుణుడు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషై మహమ్మద్ టాప్... Read more
Feb 18 | దాయది దేశం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దొంగదెబ్బ తీసి మన దేశ సైనికులపై అత్మహుతి దాడికి పాల్పడి ఏకంగా 48 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన ఘటనను భారత్... Read more