Tirumala Navaratri Brhmotsavam Begins ఇటు అమ్మవారి శరన్నవరాత్రుల.. అటు శ్రీవారి బ్రహోత్సవాలు..

Navaratri festival begins at kanaka durga temple today

Kanaka Durga temple, Dasara festival celebrations, Vijayawada, Navaratri fest, Garuda Seva, Ghatasthapana, Lord Venkateswara, Navaratri, ‪Muhurta‬‬m

The Tirumala Lord Sri Venkateswara annual Navaratri brahmotsavam festivities, begins from today after ankurarpana done on 9th. Meanwhile Kanaka Durga temple atop Indrakeeladri hills is geared up to host nine days Dasara festival celebrations.

ఇటు అమ్మవారి శరన్నవరాత్రుల.. అటు శ్రీవారి బ్రహోత్సవాలు..

Posted: 10/10/2018 11:58 AM IST
Navaratri festival begins at kanaka durga temple today

భాద్రపద మాసం ముగిసి.. ఆశ్వయుజ మాసంలోకి అడుగుపెట్టి పెట్టగానే దేశంలో ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఆశ్వయుజ మాసం తొలి రోజు నుంచే దేశవ్యాప్తంగా ప్రజలు దుర్గామాత శరన్నవరాత్రులను భక్తిశ్రద్దలతో ఆచరిస్తారు. ఆ తరువాత మాసం చివర్లో దీపావళి పండగతో ముగుస్తుంది. ఈపవిత్ర మాసం మొదలు తొమ్మిదిరోజుల పాటు అంకుఠిత దీక్ష, దక్షలతో, నిష్టగా ఉపవాస దీక్షలను కూడా ఆచరిస్తారు. పదో రోజు విజయదశమి సందర్భంగా రాత్రి వరకు దీక్షలో వుండే భక్తులు తెల్లవారి దీక్షను వదిలిపెడతారు.

ఈ దీక్షను కొందరు తమకు అనుగూనంగా కొన్ని మినహాయింపులతో చేపడతారు. కొందరు పళ్లు, కొబ్బరి నీళ్లుతో మాత్రమే దీక్షను కొనసాగించగా, మరికోందరు ఒంటిపూట బోజనంతో వుంటారు. భక్తుల వయస్సు ఇత్యాదులను పరిగణలోకి తీసుకుని పండితులు వారికి మినహాయింపులు కల్పిస్తారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ కూడా నవరాత్రి దీక్షలలో వుంటారన్న విషయం తెలిసిందే. ఆయన విదేశీ యాత్రలలోనూ తన దీక్షను కొనసాగించారు.

కాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ సారి పది రోజుల పాటు అమ్మవారి దీక్షను పూనుకున్నారు. చైత్రమాస దీక్షను అచరించే ఆయన ఈ సారి మాత్రం అమ్మవారి నవరాత్రి దీక్షను ఆచరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అధ్యాత్మిక భావన ఉట్టిపటేందుకు మరో అదనపు ఆకర్షణగా నిలిచేది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరగడమే. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన అధ్యాత్మిక శోభ పరడవిల్లుతుంది.

తిరుమలలో ఆశ్వయుజ మాసం తొలి రోజు నుంచి అంటే అమ్మవారి శరన్నావరాత్రులు ప్రారంభమయ్యే నాటి  నుంచి 9 రోజుల పాటు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. బ్రహోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. ఇక ఇవాళ సాయంత్రం శ్రీవారు పెద్దశేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగిస్తూ.. భక్తులకు అభయ ప్రధానం చేయనున్నారు. రేపు ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంసవాహన సేవలు జరుగనున్నాయి.

12న ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చే దేవదేవుడు, 13న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత  కీలకమైన గరుడోత్సవం 14న రాత్రికి జరుగనుంది. 15న హనుమంత వాహనం, పుష్పపల్లకి, గజవాహన సేవలు, 16న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 17న స్వర్ణ రథం, అశ్వవాహన సేవల తరువాత 18న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.

ఇక ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని శైవ క్షేత్రాల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునుంచే కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. నేడు అమ్మవారు  స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే 9 రోజులూ నిత్యమూ లక్ష కుంకుమార్చన, చండీయాగాలు జరుగుతాయని, రెండుపూటలా అన్న ప్రసాద వితరణ ఉంటుందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh