Petrol and diesel prices hiked again అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు..

Petrol and diesel prices hiked again

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices have been on a continuous rise recently, due to which consumers have taken to social media and other platforms to complain of the additional expense.

అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు..

Posted: 10/09/2018 10:50 AM IST
Petrol and diesel prices hiked again

పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డలను రోజు రోజు తిరగరాస్తూ.. ముందుకు సాగుతున్న ఇంధన ధరలు.. ఇవాళ తాజాగా మళ్లీ పెరిగాయి. ధరలు ఏకంగా సెంచరీని తాకేందుకు పోటీ పడుతూ సాగుతున్న క్రమంలో కేంద్రం తాము గత నాలుగేళ్ల హయాంలో ఏకంగా 13 రూపాయల మేర పెంచిన ఎక్సైజ్ పన్నును గతంలో ఓ పర్యాయం తగ్గించగా, ఇటీవల మరో పర్యాయం తగ్గించి కొంత ఊరటను కల్పించింది.

అయితే ఆ ఊరట కూడా చూస్తుండగానే అవిరైపోయింది. ఇప్పటికే కేంద్రం కల్పించిన ఊరటపై చాలా తక్కువ ధర తగ్గించారని, చాలా ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో క్రమంలో రోజువారిగీ పెరుగుతున్న ఇంధన ధరలు మళ్లీ మునపటి ధరలను అందుకునేందుకు పోటీపడుతున్నాయి. తాజాగా పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.87.19కి చేరింది. అదే విధంగా లీటర్ డీజిల్ రూ.80.69కి చేరింది.

ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటో కానీ.. వాహనదారులు మాత్రం ధరల పెరుగుదలతో బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా ఇంధన ధరలను ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 29 పైసలు పెంచాయి. దీంతో, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 82.26కు, డీజిల్ ధర రూ. 74.11కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 87.73కు, డీజిల్ ధర రూ. 77.68కు పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles