Congress to win in MP, Rajasthan and Chhattisgarh ఆ మూడు రాష్ట్రాలు హస్తగతమే.. సర్వేలలో వెల్లడి..

Congress to comeback in mp rajasthan and chhattisgarh opinion poll

abp news, Assembly elections 2018, Bharatiya Janata Party, Chhattisgarh assembly Election 2018, Madhya Pradesh Assembly election 2018, opinion polls, Rajasthan assembly election 2018, shivraj singh chouhan, Narendra Modi, Amit Shah, Rahul Gandhi, politics

Narendra Modi-Amit Shah-led BJP, the saffron party is likely to face defeat in the upcoming assembly elections in three key states - Madhya Pradesh, Rajasthan and Chhattisgarh – according to the latest opinion poll.

ఆ మూడు రాష్ట్రాలు హస్తగతమే.. సర్వేలలో వెల్లడి..

Posted: 10/08/2018 12:44 PM IST
Congress to comeback in mp rajasthan and chhattisgarh opinion poll

ఎన్నికల కమిషన్‌ దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయా రాష్ట్రాల్లో విజయం ఎవరిని వరిస్తుంది.. అక్కడి పరిస్థితులు ఎలా వున్నాయన్న అంశాలపై అధ్యయనం చేసిన సర్వే సంస్థ.. ఈ సారి బీజేపి అత్యంత పట్టున్న ఛత్తీస్ గఢ్‌, మధ్యప్రదేశ్ లు హస్తగతం అవుతాయని అంచనాలు వేశాయి. ఇక అటు రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారంలోకి రానుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు సర్వే సంస్థ ఏబిపి న్యూస్, సీ-ఓటర్ సంస్థలు సంయుక్తంగా సర్వేను నిర్వహించి వివరాలను వెల్లడించాయి.

రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం‌ ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, మిజోరాం, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించి.. ఎన్నికల నిర్వహణకు తాము సిద్దమని కూడా ప్రకటించింది. అయితే మూడు రాష్ట్రాల్లో మాత్రం ప్రధాని నరేంద్రమోడీ, జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా నేతృత్వం వహిస్తున్న కాషాయ పార్టీకి మాత్రం పరాభవం తప్పదని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ దాదాపుగా దశాబ్ధమున్నర కాలం పాటు అధికారంలో వున్న బీజేపీకి ఈ సారి ప్రజలు తిరస్కరించనున్నారని సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తమ జెండాను ఎగరవేయనుందని తెలుస్తుంది. ఇక రాజస్థాన్ లో కూడా అధికార బీజేపి పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి వసుందర రాజే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని.. దీంతో ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకోనుందని అంచనా వేసింది.

ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే ప్రకారం.. రాజస్థాన్ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోనుంది. రాజస్థాన్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 200 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీకి 142, బీజేపీకి 56 సీట్లు దక్కుతాయని సర్వే ద్వారా వెల్లడైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 122 సీట్లు దక్కుతాయని, బీజేపీకి 108 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కి 47, బీజేపీకి 40 సీట్లు వస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  BJP  assembly elections  Madhya Pradesh  Rajasthan  Chhattisgarh  ABP News-CVoter survey  

Other Articles