MVVS Murthy made his mark in vishaka deveplopment విశాఖ అభివృద్దిలో తనదైన మార్క్ వేసిన మూర్తి

Chandrababu express deep grief over death of mvvs murthy

MVVS Murthy, Chandrababu, MVVS Murthy death, condolence, Telugu Desam Party, MVVS Murthy, MVVS Murthy death, MVVS Murthy no more, MVVS Murthy passes away, MVVS Murthy dead, former vishaka MP, MLC, Telugu Desam Party, Telugu Association of North AmericaAndhra Pradesh

Andhra Pradesh chief Minister and TDP party President Chandrababu express deep grief on the death of MVVS Murthy, a senior Telugu Desam Party leader and the director of GITAM University.

ఎంవివిఎస్ మూర్తి మరణం పట్ల చంద్రబాబు దిగ్రాంతి

Posted: 10/03/2018 01:22 PM IST
Chandrababu express deep grief over death of mvvs murthy

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంటు సభ్యుడు గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ వాసులకు గొల్డ్ స్పాట్ మూర్తిగా సుపరిచితుడైన.. ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం చెందడం పట్ల ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు అనేక మంది రోడ్డు ప్రమాదంలోనే అసువులు బాయడం తనను తీవ్రంగా కలిచివేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మరణంపై తన సంతాపాన్ని వెలిబుచ్చారు.

గాంధీ ఆదర్శాల కోసం పనిచేసిన ఆయన గాంధీ జయంతినాడే దారుణ ప్రమాదానికి గురికావడం యాదృచ్చికమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, విద్యావేత్తగా, విద్యాదాతగా చెరగిపోని ముద్ర వేసిన వ్యక్తి ఆయనని అన్నారు. మూర్తి మరణం విద్యా రంగానికి, రాజకీయ రంగానికీ తీరనిలోటని, తనకు అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరని మూర్తితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

విశాఖ అభివృద్ధిలో ఎంవీవీఎస్ మార్కు..

విశాఖపట్నం వాసులకు గొల్డ్ స్పాట్ మూర్తిగా సుపరిచిడుతైన ఎంవీవీఎస్ మూర్తి.. ఆ నగరం శరవేగంగా అభివృద్ధి భాటలో నిలబడేందుకు ఆయన పాత్ర ఎంతో వుంది. విశాఖను పారిశ్రామిక కేంద్రంగా, విద్యా నిలయంగా మార్చిన తొలి తరం నేతల్లో ఆయన ఒకరు. ఆయనే పూర్తి పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి. ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదుగానీ, గోల్డ్ స్పాట్ మూర్తి అంటే మాత్రం విశాఖలో అందరికీ సుపరిచితం. విశాఖ అభివృద్ది ఎక్కడ వెతికినా ఆయన మార్కు డెవలప్ మెంట్ స్పష్టంగా కనబడుతుంది.

తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం మూలపాలెం గ్రామంలో జన్మించిన మూర్తి, కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆపై ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత, హైకోర్టులో న్యాయవాదిగానూ పనిచేశారు. ఆపై వ్యాపార రంగంలో కాలుమోపి, విశాఖపట్నంలో బాట్లింగ్ సంస్థను ఏర్పాటు చేయడంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఒకప్పుడు ఎంతో పేరున్న గోల్డ్ స్పాట్ శీతల పానీయాలను తయారు చేసే ఆయన్ను ప్రజలు 'గోల్డ్ స్పాట్ మూర్తి'గా ముద్దుగా పిలుచుకునేవారు.

అనతికాలంలోనే ఈ వ్యాపారంలో రాణించిన ఆయన, గీతం యూనివర్శిటీని స్థాపించి వేలాది మందికి విద్యాదానం చేశారు. మహిళల విద్యకు ఎంవీవీఎస్ మూర్తి విశేష కృషి చేశారు. అమలాపురంలో మహిళా జూనియర్ కళాశాలను, విశాఖలో అంబేద్కర్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో సీతారామ డిగ్రీ కాలేజీని స్థాపించారు. తన స్వగ్రామానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మూలపాలెంలో ఓ కాలేజీని ప్రారంభించారు.

1987 నుంచి 1989 వరకూ వుడా చైర్మన్ గా వున్న మూర్తి, నగరాభివృద్ధికి కృషి చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన వేళ, ఆయన వెంట నడిచారు. ప్రముఖ నేతగా గుర్తింపు తెచ్చుకుని 1991, 1999లో రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచి, ప్రజా సేవ చేశారు. అమెరికాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్త తెలుసుకున్న విశాఖ వాసులు, ఆయన్ను తలచుకుని కన్నీరు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MVVS Murthy  Chandrababu  MVVS Murthy death  condolence  Telugu Desam Party  Andhra Pradesh  

Other Articles