MVVS Murthy dies in car accident in US రోడ్డు ప్రమాదంలో ఎంవివిఎస్ మూర్తి దుర్మరణం

Gitam university founder mvvs murthi dies in car accident in us

MVVS Murthy, MVVS Murthy death, MVVS Murthy no more, MVVS Murthy passes away, MVVS Murthy dead, former vishaka MP, MLC, Telugu Desam Party, Telugu Association of North America

MVVS Murthy, a senior Telugu Desam Party leader and the director of GITAM University, has died in a road accident in the US. Murthy, a former Vishakhapatnam MP, was travelling in a van with four other members of his family.

రోడ్డు ప్రమాదంలో ఎంవివిఎస్ మూర్తి దుర్మరణం

Posted: 10/03/2018 11:51 AM IST
Gitam university founder mvvs murthi dies in car accident in us

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంటు సభ్యుడు గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ వాసులకు మాత్రం గొల్డ్ స్పాట్ మూర్తిగా సుపరిచితుడైన.. ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తి సహా మరో ముగ్గురు మృతి చెందారు. ఈ నెల ఆరవ తేదీన అమెరికా పరిధిలోని కాలిఫోర్నియాలో గీతం యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చారు.

కాగా కాసింత ముందుగా వచ్చిన ఆయన తన స్నేహితులతో కలసి వెళ్లిన విహారయాత్ర.. ఆయన ప్రాణాలను బలిగొనింది. అమెరికాలోని అలస్కాలో జరిగిన ఘోర రోడ్డ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు తనతో పాటు నలుగురు స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్తున్న ఆయన కారు ఎదురుగా వస్తున్న ఫఓర్డ్ ట్రక్ బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కాగా ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని అలస్కా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారని సమాచారం.

ఈ ఘటనలో ఈయనతో పాటు కారులో ఉన్న  వెలువోలు బసవపున్నయ్య, వీరమాచనేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరి మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు, అస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు. కాగా కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే వుందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తానా సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles