Petrol and diesel prices hiked again రికార్డుస్థాయికి పెరిగిన ఇంధన ధరలు..

Petrol price rates at all time high across country

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices have been on a continuous rise recently, due to which consumers have taken to social media and other platforms to complain of the additional expense.

రికార్డుస్థాయికి పెరిగిన ఇంధన ధరలు..

Posted: 09/25/2018 01:26 PM IST
Petrol price rates at all time high across country

పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే తొంబై రూపాయలు దాటిన పెట్రోల్.. ఇక వందను అందుకునేందుకు పోటీపడుతున్నా.. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. విపక్షంలో వున్నప్పుడు ధరలు పెరుగుతున్నాయని గగ్గోలు పెట్టిన పార్టీయేనా.. ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నది అని దేశప్రజలు, మరీ ముఖ్యంగా వాహనదారులు నివ్వెరపోయేలా చేస్తుంది. అప్పుట్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పెద్దలే.. గద్దెనెక్కిన తరువాత ఇలా రంగుమారుస్తారా.? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ధరలు తగ్గినప్పుడు తమ ఘనతగా చెప్పుకున్న ప్రభుత్వం నాలుగేళ్లుగా పెంచిన ఎక్సైజ్ పన్నును కూడా తగ్గించకుండా.. మరింత భారం మోస్తున్న వాహనదారులపై చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇవాళ కూడా తాజాగా ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటికే రూ. 90ని దాటిన లీటర్ పెట్రోలు ధర, సెంచరీ దిశగా శరవేగంగా సాగుతోంది. నేడు పెట్రోలుపై 14 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ అర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 90.22కు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో రూ. 82.86కు, కోల్ కతాలో రూ. 86.48కు, చెన్నైలో రూ. 86.13కు, హైదరాబాద్ లో రూ. 87.84కు పెట్రోలు ధర పెరిగింది. ఇదే సమయంలో లీటర్ డీజిల్‌ పై 10 పైసల ధర పెరుగగా, ఢిల్లీలో రూ. 74.12కు, ముంబైలో రూ. 78.69కు, కోల్‌ కతాలో రూ. 75.97కు, చెన్నైలో రూ. 78.36కు హైదరాబాద్‌ లో రూ. 80.62కు ధర పెరిగింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతూ ఉండగా, డాలర్‌ తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో 'పెట్రో' ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles