konda couple open letter to KCR విద్యార్థులకు కాదు.. కుటుంబానికే నాలుగు ఉద్యోగాలు: కొండా

Konda couple open letter to kcr on ticket issue

konda couple open letter to kcr, konda open letter to kcr, assembly tickets, konda surekha, konda murali, open letter, KCR, Congress, Uttam kumar reddy, rahul Gandhi, jagga reddy, nagam janardhan reddy, TRS, Telangana Politics

Former MLA Konda Surekha on Tuesday takes on K Chandrasekhar Rao for MLA ticket issue and critisizes him in all aspects along with allegations of commissions and settlements.

తెలంగాణలో దొరల పాలన.. కమీషన్లు.. సెటిల్మెంట్లకే ప్రాధాన్యం: కొండా సురేఖ

Posted: 09/25/2018 12:59 PM IST
Konda couple open letter to kcr on ticket issue

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత కొండా సురేఖ దంపతులు విమర్శలు గుప్పించారు. తెలంగాణ అమరవీరుల సమాధులపై పునాధులు వేసుకుంటూ ఎదిగిన పార్టీ.. వారినే విస్మరించి.. కడకు శ్రీకాంత్ చారీ తల్లి పార్వతమ్మకు కూడా అమె కోరుకున్న అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వలేని స్థితిలో చేరుకుందని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ విలువకు పాతరేసిన కేసీఆర్ సర్కార్.. అనధికారికంగా దొరల పాలనకు శ్రీకారం చుట్టిందని అరోపించారు. దొరలకు ఒక సూత్రాన్ని అమలు చేస్తున్న పార్టీ.. బీసిలకు, ఎస్సీ,ఎస్టీలకు మరో విధానాన్ని అమలు చేస్తుందని అరోపించారు.

ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించే ముఖ్యమంత్రులను దేశంలో ఎక్కడా చూడలేదని అమె దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తే వెళ్లి కలుద్దామని అనుకున్న తాము.. నిరుత్సాహానికి గురై.. చివరకు ప్రగతి భవన్ లోనే కలుద్దామని అపాయింట్మెంట్ కోసం నాలుగున్నరేళ్లుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. చివరకు తన పుట్టినరోజు నాడు ఆయన అశ్వీర్వాదాలు పొందుతామని ప్రయత్నించినా.. అపాయింట్మెంట్ లభించలేదని దుయ్యబట్టారు. పార్టీ ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్ లభించకపోతే.. ఇక సామాన్యుల పరిస్తితి ఏంటని అమె ప్రశ్నించారు.

మంత్రి పదవి ఇస్తామన్న హామీ లభించడంతో ఐదేళ్లుగా తాము పార్టీలో కొనసాగినా.. ఆ హామీ నెరవేరలేదని.. ఎమ్మెల్యేగా గెలిచన తరువాత ఐదేళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని అమె దుయ్యబట్టారు. కనీసం తన తండ్రి మరణించిన క్రమంలో కూడా ఆయన తనను పరామర్శించేందుకు రాలేదని.. అయితే టీడీపీ సీటుపై గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎర్రెబెల్లి తండ్రి మరణించగానే ఆయన ఇంటికి వెళ్లి మరీ సీఎం కేసీఆర్ పరామర్శించారని.. ఇది వెలమ దొర అహంభావానికి ప్రతీక కదా అని అమె ప్రశ్నించారు.

ఐదేళ్లుగా పార్టీలో వున్న తమకు మంత్రి పదవి ఇవ్వకపోయినా సర్థుకుపోయామని, ఎన్నికల వేళ తమకు టికెట్లు ఇవ్వకుండా.. ఎందుకు పొమ్మనలేక పోగబెట్టుతున్నారని అమె ప్రశ్నించారు. పార్టీ టికెట్లను తనకు కేటాయించకపోవడంలో అంత్యర్యమేమిటో చెప్పాలని తాము అడిగిన ప్రశ్నలకు పార్టీ నుంచి కానీ, కేసీఆర్ కుటుంబం నుంచి కానీ ఎలాంటి సమాధానం రాలేదని కొండా సురేఖ విమర్శించారు. ఏ కారణం చేత తమకు టికెట్ ఇవ్వకుండా గెంటేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

తన తరువాత తన తనయుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలన్న తపనతోనే కేసీఆర్ చర్యలు వున్నాయని అమె విమర్శించారు. ఐదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ రాకపోగా.. కమీషన్లు, మామూళ్లు ఇవ్వకుండా పని జరగని రోజులు దాపురించాయని విమర్శించారు. అన్ని ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు లభిస్తున్నాయని అమె అరోపించారు. స్వయంగా కేటీఆర్.. మున్సిఫల్ చైర్ పర్సెన్ కు కమీషన్లు తీసుకోవాలని హితభోధ చేశారన్న వీడియో మీడియాలో కూడా సంచలనంగా మారిన విషయాన్ని అమె గుర్తు చేశారు.,

టీఆర్ఎస్ లో కేసీఆర్ పిలుపుతో జెండా పట్టి.. ఆయనతో నడిచిన ఎంతమంది నేతలకు న్యాయం జరిగిందని అమె ప్రశ్నించారు. సీనియర్ నాయకులమైన తమకు మంత్రి పదవులు ఇవ్వని కేసీఆర్.. తెలంగాణ ఉద్యమం మధ్యలో అమెరికా నుంచి అఘమేఘాల మీద వచ్చిన కొడుక్కు మాత్రం మంత్రి పదవిని ఇచ్చారని దుయ్యబట్టారు. మంత్రి పదవిని, సీఎం కొడుకు అన్న హోదాలో కేటీఆర్ హైదరాబాదులో ఎన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారో కూడా బయట పెట్టాలని కొండా సురేఖ అరోపించారు.

ఈ సందర్భంగా ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కుట్రులు, కుయుక్తులు పన్నుతూ.. పార్టీలోకి వచ్చిన నేతలను వాడుకుని పాడేసే తత్వం కేసీఆర్ దని అమె విమర్శించారు. ఇందుకు ఆలె నరేంద్ర, విజయశాంతీలే నిదర్శనమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన తన ఒక్కడితోనే సాధ్యమైందని గొప్పలకు పోతున్న కేసీఆర్.. వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగినన్నాళ్లు ఎందుకు ఉద్యమ ఊసు ఎత్తకుండా మౌనంగా వున్నారని ప్రశ్నించారు.  

తెలంగాణ పేరు చెప్పి తమ కుటుంబాన్ని సంపన్న కుటుంబంగా మార్చుకుంటున్న కేసీఆర్.. నోట్ల రద్దు వెనువెంటనే ప్రధాని మోడీది తుగ్లక్ నిర్ణయమని వ్యాఖ్యలు చేసి.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత ప్రధాని డిజిటల్ కరెన్సీ, అవినీతి రహిత భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్లేటు ఫిరాయించే ముఖ్యమంత్రి కేసీఆర్ కాక మరెవ్వరు వున్నారని అమె ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : konda surekha  konda murali  open letter  KCR  Errabelli Dayakar Rao  TRS  Telangana Politics  

Other Articles