AP police releases maoists photos in brutal murder of MLA ఎమ్మెల్యే, మాజీల హత్య కేసులో మావోల ఫోటోలు విడుదల

Ap police releases maoists photos in brutal murder of mla

MLA Kidari murder, MLA KSarveswara Rao, Ex MLA saveri Soma, maoists, Aruna, Srinubabu, Swaroopa, Police, Photos, Araku Valley, Vizag city, Maoist sympathisers, Special Operation Team, DGP Tagore, Andhra Pradesh, Politics

After the attack by Maoists on Araku MLA Kidari Sarveshwar rao and ex mla Soma, police releases the photos of naxals leading this operation.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య: మావోల ఫోటోలు విడుదల

Posted: 09/24/2018 06:20 PM IST
Ap police releases maoists photos in brutal murder of mla

విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతుంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల చేతులు వెనక్కి కట్టేసి మోబైల్ పోన్ సిగ్నల్ లభించని ప్రాంతానికి తీసుకెళ్లి అతి దారుణంగా హతమార్చిన మావోలలో ముగ్గురు నక్సలైట్లను పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురి నేతృత్వంలోనే ఈ దారుణ ఘటనలు జరిగాయని ప్రత్యక్ష సాక్షులను బట్టి తెలుసుకున్న పోలీసులు.. ఈ మేరకు వారి ఫోటోలను విడుదల చేశారు.

ఆదివారం నాడు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమను మావోయిస్టులు దారి కాచి మరీ మార్గమధ్యంలోంచి కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మావోల అపరేషన్ కు శ్రీనుబాబు, అరుణ, స్వరూపలు నేతృత్వం వహించారని పోలీసులు గుర్తించారు. అరుణ ఈ దాడికి నాయకత్వం వహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అరుణ నేతృత్వంలోని దళమే ఈ దాడికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత స్థానికంగా  లభ్యమైన ఆనవాళ్లతో పాటు  ప్రత్యక్షసాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు  మావోల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ దాడిలో పాల్గొన్నవారిలో పాల్గొన్న మావోల్లో ఛత్తీస్‌ఘడ్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారనే  అనుమానాలు కూడ లేకపోలేదు. చలపతి  భార్య అరుణ ఈ దాడికి నేతృత్వం వహించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles