Petrol crosses Rs 87 in Hyderabad హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ రూ. 87

Petrol crosses rs 90 in mumbai costs rs 91 96 in patna

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price, PM Modi

In no respite to the citizens, fuel prices in the country touched new heights. In Mumbai, the petrol price has touched Rs 90.08 per litre, while diesel is being retailed at Rs 78.58 per litre.

మోడీ సర్కార్ ఘనత: లీటరు పెట్రోల్ తొంబై దాటేసింది

Posted: 09/24/2018 12:12 PM IST
Petrol crosses rs 90 in mumbai costs rs 91 96 in patna

నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ.. అధికారిక పగ్గాలను చేపట్టగానే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కాకతాళీయంగానే అవి తగ్గినా.. దానిని కూడా తన అకౌంట్లోకి వేసుకున్నారు ప్రధాని. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదలను కూడా ఆయన ప్రచారంగా వాడుకున్నారు. మరి ఇప్పుడు ధరలు మళ్లీ పెరుగుతున్న క్రమంలో ఈ ఘనత కూడా ప్రధాని తన అకౌంట్ లో వేసుకోగలరా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

జీవితకాల గరిష్టస్థాయిలో దూసుకుపోతున్న ఇంధన ధరలు వాహనదారుల బేబులకు చిల్లులు పెడుతున్నా.. ఇది బీజేపి ఘనతే అని ఏ ఒక్క బీజేపి నేత ధైర్యంగా ఎందుకు అందీకరించలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా వున్న ముడిచమురు ధరతో పోల్చితే.. దాదాపుగా లీటరు పెట్రోల్ పై 25 రూపాయల ధరల తక్కువగా వుండాలని కేంద్ర మాజీ అర్థిక శాఖ మంత్రి చిదంబరం కూడా పేర్కోన్నారు. దాదాపుగా పది రూపాయల మేర కేంద్రం విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీ తో పాటు బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధరను పరిగణలోకి తీసుకుంటే ధరలు రూ.25 మేర తగ్గుతుందని ఆయన తెలిపారు.

ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతున్న ధరలను అద్యయనం చేసిన కేంద్ర ఇంధన శాఖ.. ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఈ ఏడాది ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు కూడా సిద్దం చేస్తుందని చెప్పారు. ఇలా ఎన్నో ప్రకటనలు చేసిన ప్రధాన్.. ప్రస్తుతం పెట్రో ధరలు అకాశాన్ని అందుకునేందుకు వేగంగా పరిగెడుతున్న తరుణంలో మాత్రం మౌనాని వహించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మౌన ముని అని అక్షేపించిన నేతలు ఇప్పుడెందుకు అంతకన్నా అధికంగా ధరలు దూసుకుపోతున్నా మౌనాన్ని వహిస్తున్నారన్న ప్రశ్నలు వాహనదారుల నుంచి వినబడుతున్నాయి.

ఇక జీఎస్టీ పేరు చెబితే చాలు చిన్నా మధ్య తరగతి వ్యాపారవేత్తలు హడలిపోతున్నారు. అయితే దీంతో దేశ ప్రజలకు మాత్రం చాలా లాభం చేకూరుతుందని జీఎస్టీపై అధికారులు అనేక విధాలు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రో ధరలు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తే చాలా ధరలు తగ్గుతాయన్న ఆశ వాహనదారుల నుంచి వ్యక్తం అవుతుంది. కాగా.. ప్రసుత్తం జీఎస్టీ పరిధిలో అందులోనూ తొలి స్లాబ్ కిందకు వచ్చే ప్యాకెట్ పాల ధర.. జీఎస్టీకి ముందుకు.. తరువాతలో ఎలాంటి మార్పు రాలేదన్నది కూడా ప్రజలకు తెలిసిందే. మరి అలాంటప్పుడు జీఎస్టీ వల్ల కలిగే లాభం ఏంటన్నదానిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

కాగా ఇవాళ ముంబైలో లీటర్ పెట్రోల్ ధర తొంబై రూపాయల పైకి చేరుకుంది. దేశ అర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర 90.08కు చేరుకోగా, డీజిల్ ధర 78.58కి చేరుకుంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ పెట్రోల్ ధర.. 82.72కు చేరుకోగా, డీజిల్ ధర 74.02కు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.87.58కి చేరింది. అటు చెన్నైలో లీటరు పెట్రోల్ 85.87కు చేరింది. ఇక కోల్ కతాలో పెట్రోల్ ధర 84.44కు చేరింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఇక త్వరలోనే పెట్రోల్ ధరలు సెంచరీ మర్కును చేరనున్నాయా.? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles