Actor lodges plaint against daughter నటుడు విజయకుమార్ ఇంటిని అక్రమించుకున్న తనయ..

Actor vijayakumar lodges police complaint against daughter vanitha

Vijayakumar (actor), Vanitha Vijayakumar, Daughter, Ashta Lakshmi, Maduravoyal police station, crime

Veteran actor Vijayakumar lodged a complaint at the Maduravoyal police station against his daughter Vanitha alleging that she was trying to take possession of his house and refusing to vacate the residence which she had rented for a shoot.

నటుడు విజయకుమార్ ఇంటిని ఆక్రమించుకున్న తనయ.. కేసు నమోదు

Posted: 09/21/2018 11:42 AM IST
Actor vijayakumar lodges police complaint against daughter vanitha

పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్ సంస్కృతిలో.. మనం అన్న పదం పోయి.., నేనా.. నా అన్న స్వార్థ భావన అధికం కావడంతో.. మనుషుల మధ్య అనుబంధాలకు, ఆప్యాయత, అనురాగాలకు చోటు తగ్గి.. అంతా మనీ మేడ్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయ్ అని కొన్ని దశాబ్దాల క్రితమే మన పెద్లలు చెప్పారు. అలాంటి సంస్కృతిని ఆచరిస్తూ.. పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులు.. చివరకు అనుబంధం, అప్యాయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు అడుకునే నాటకం అంటూ వైరాగ్యంలో సత్యాలను వల్లె వేయాల్సి వస్తుంది.

ప్రస్తుతం త‌మిళ సీనియ‌ర్ న‌టుడు విజ‌య్ కుమార్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. కన్న కూతురు కదా.. అని తనకు చెందిన ఓ ఇంటికి షూటింగ్ నిమిత్తం అమెకు ఇస్తే.. షూటింగ్ పూర్తైన తరువాత కూడా అమె దానిని తన తండ్రికి అప్పగించకపోవడం.. అడగటానికి వచ్చిన తండ్రిని రౌడీలతో బెదిరించడంతో ఆయన దిక్కుతోచని పరిస్థితుల్లో.. తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు. కన్న కూతురిపైనే పోలీసులకు పిర్యాదు చేశాడు.

తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. విజ‌య్ కుమార్ అల‌పాక్క‌మ్ లోని అష్ట‌ల‌క్ష్మీ న‌గ‌ర్ 11వ వీధిలో ఉన్న త‌న ఇంటిని అప్పుడప్పుడు షూటింగుల‌కు అద్దెకిస్తున్న‌ట్టు తెలిపాడు. ఈ క్ర‌మంలో త‌న కూతురు షూటింగ్ కోసం ఇల్లు అద్దెకి అడ‌గ‌డంతో ఇచ్చాన‌ని విజ‌య్ కుమార్ అన్నారు. అయితే షూటింగ్ పూర్తైన త‌ర్వాత కూడా విజ‌య్ కుమార్ కూతురు వ‌నిత ఇల్లు ఖాళీ చేసి తనకు అప్పగించాల్సింది పోయి.. అమె అందులో నివసిస్తుందని స్థానిక మ‌ధుర‌వాయిల్ పోలీస్ స్టేష‌న్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.

అంతేకాదు తన ఇంటిని తనకు అప్పగించాలని ఆయన తన కూతురిని అడగిన నేపథ్యంలో న్యాయ‌వాదులు, రౌడీల‌తో బెదిరింపులకి దిగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. విజ‌య్ కుమార్ ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసుకున్న మధురవాయిల్‌ పోలీస్ క‌మీషనర్‌ విచారణ చేస్తున్నారు. అయితే ఇంట్లో త‌న‌కు భాగం ఉన్నందునే తాను ఇల్లు ఖాళీ చేయ‌న‌ని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగింది వ‌నిత‌. అంతేకాదు మీడియాతోను దురుసుగా ప్ర‌వ‌ర్తించి వారి కెమెరాల‌ని నేల‌కేసి కొట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles