Two criminals shot dead in Aligarh encounter మీడియా సాక్షిగా లైవ్ ఎన్ కౌంటర్..

Up police showcases live encounter for media kills 2 criminals

Up Encounter, Encounter in UP, 2 Shot Dead in encounter, murder, Cops encounter in Aligarh, journalist invited to watch live encounter, Alok Pandey, Lucknow, Aligarh, live encounter, murder, Cops, journalists, uttar pradesh goverment, crime

Two notorious criminals accused of murders and theft, were killed in an encounter with the police in western Uttar Pradesh's Aligarh district. The encounter was filmed by local journalists with permission from the police.

ITEMVIDEOS: ఉత్తర్ ప్రదేశ్ లో.. మీడియా సాక్షిగా లైవ్ ఎన్ కౌంటర్..

Posted: 09/21/2018 10:40 AM IST
Up police showcases live encounter for media kills 2 criminals

ఉత్తరప్రదేశ్ లోని యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం నేరాగాళ్లపై ఉక్కుపాదం మోపుతూ.. పలు కేసుల్లో నేరాభియోగాలు నమోదైనా.. పట్టబడకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని ఎన్ కౌంటర్ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు పరఢవిల్లడానికి చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో పలు ఎన్ కౌంటర్లలో ప్రభుత్వం కూడా అనేక విమర్శలను ఎదుర్కొంది. కేవలం విఫక్షాలకు చెందిన పార్టీ క్రిమినల్స్ నే ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని, ఎన్ కౌంటర్ల పేరుతో క్రిమినల్స్ ను భయభ్రాంతులకు గురిచేసి.. వారిని తమ పార్టీలోకి వచ్చేలా కూడా ఒత్తడి చేస్తుందన్న విమర్శలున్నాయు. ఈ క్రమంలో పోలీసులు మీడియాను తీసుకెళ్లి ఎన్ కౌంటర్లు కూడా పారదర్శకంగా జరుగుతున్నాయన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేశారు. అలీగఢ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసేందుకు వెళుతున్నామని ముందుగానే మీడియాకు చెప్పి, వారిని మచువా గ్రామానికి తీసుకెళ్లిన పోలీసులు, ఇద్దరు హంతకులను కాల్చి చంపారు. అదెలా అంటే..

పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని అలిగఢ్ ప్రాంతంలో ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్లు తలదాచుకున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. మీడియాకు సమాచారం అందించారు. తమ వెంట వస్తే.. ఎన్ కౌంటర్లు ఎలా పారదర్శకంగా జరుగుతున్నాయో చూపుతామని కూడా సమాచారం అందించడంతో.. మీడియా మిత్రులు కూడా వెంటవెళ్లారు. అలిగఢ్ లోని మచువా ప్రాంతానికి మీడియా మిత్రులను తీసుకెళ్లిన పోలీసులు.. వారి ఎదురుగానే నేరగాళ్లను ఎన్ కౌంటర్లో హతమార్చారు. హంతకులు కూడా ఎదరుకాల్పులకు పాల్పడటంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్ మచువాలోని ఓ పాడుబడిన భవంతిలో దాగున్నారన్న విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న పోలీసులు, మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడే వారిని ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు. హతులైన ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా రికార్డులకు ఎక్కిన ముస్తకీమ్, నౌషద్ గా గుర్తించారు. వీరిపై ఆరు హత్య కేసులు, పదికి పైగా దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ తరువాత మృతుల వద్ద కంట్రీ మేడ్ ఫిస్టల్స్ లభించాయి. ఈ ఎన్ కౌంటర్ పూర్తి పారదర్శకమేనని చెప్పేందుకే మీడియాను పిలిచామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ దృశ్యాలు ఇప్పుడు వార్తా చానళ్లలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Up Encounter  Aligarh  live encounter  murder  Cops  journalists  Alok Pandey  Lucknow  uttar pradesh  crime  

Other Articles