Young guy gave a kick to Honour killer at hyderbad ప్రేమపెళ్లిపై కత్తిగట్టిన తండ్రిని.. తన్నిన ఒక్క మగాడు..

Young guy gave a kick to honour killer at hyderbad

honour attack in hyderabad, another honour attack, honour attack in erragadda, honour attack on newly married couple, honour attack on newly married, honour attack on madhavi, navadeep, erragadda, borabanda, telangana, crime

Another Honour attack incident took place in Erragadda of Hyderabad, while the girl's father attacked newly married couple, A young guy who came in a flash kicke the honour killer and ran in a flash

ప్రేమపెళ్లిపై కత్తిగట్టిన తండ్రిని.. తన్నిన ఒక్క మగాడు..

Posted: 09/19/2018 08:34 PM IST
Young guy gave a kick to honour killer at hyderbad

హైదరాబాద్ లో అత్యంత దారుణంగా యువ ప్రేమికులు… నవ వధూవరులను చంపేందుకు అమ్మాయి తండ్రి ప్రయత్నించాడు. గోకుల్ థియేటర్ దగ్గర నవ దంపతులు రాగానే… తన బ్యాగునుంచి కొడవలి తీసి ఒక్కసారిగా వారిద్దరిపై వెనుకనుంచి వేటు వేశాడు. ముందు అబ్బాయిపై వేటు పడగానే అతడు కుప్పకూలాడు. ఆ తర్వాత అమ్మాయి ప్రతిఘటించినప్పటికీ.. తన దగ్గరున్న కొడవలితో ముందు ఆమె చేయి నరికాడు. తర్వాత చెవిమీదుగా తలపై మరోవేటు వేశాడు.

ఈ సమయంలో ఒక వ్యక్తి.. సినిమా చూస్తున్నట్టు అతడిపక్కనుంచే వెళ్లిపోయాడు. మరోవ్యక్తి పట్టుకుందామని ట్రై చేశాడు. ఐతే.. నిందితుడు కొడవలి చూపించడంతో.. అతడు భయపడి వెనక్కి వెళ్లిపోయాడు. ఐతే… అమ్మాయి తండ్రి వెనక్కి తిరిగి ఉన్నప్పుడు దూరం నుంచి పరుగెత్తుకంటూ వచ్చిన ఓ వ్యక్తి… నిందితుడిని వెనుకనుంచి ఒక్క తన్ను తన్నాడు. మళ్లీ అతడి తిరిగి కత్తి చూపించేలోపు దూరంగా పరుగెత్తాడు. ఇక్కడుంటే జనం పట్టుకుంటారన్న భయంతో.. నిందితుడు పారిపోయాడు.

అంతమందిలో… జనం గుంపుగా చూస్తున్నప్పుడు… కొడవలి వేటుకు.. చావుకు భయపడకుండా ధైర్యం ప్రదర్శించాడు ఆ యువకుడు. ఇలాంటి సందర్భంలో జనం ఇలాగే స్పందించాలి. ఇలాంటి తెగువే చూపించాలి. ప్రాణభయం అందరికీ ఉంటుంది. కానీ.. జనం కలిసికట్టుగా గుంపుగా ఎదిరించినప్పుడు గన్ను పట్టుకొచ్చినోడైనా భయపడిపోవడం ఖాయం. ఆ డేరింగ్ పర్సన్ వివరాలు తెలియవు కానీ… సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో.. అతడి తెగువ కనిపించింది. నిందితుడిని ఎగిరి ఒక్క తన్ను తన్ని ఉలిక్కిపడేలా చేశాడు. చంపటానికి వచ్చినోడికే.. చావుభయం చూపించాడు. హత్యాయత్నం జరిగినప్పుడు ప్రాణాలకు తెగించి తనవంతుగా ప్రతిఘటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honour attack  newly married couple  navadeep  madhavi  maruthi rao  Hyderabad  telangana  politics  

Other Articles