governor to inaugrate 2nd phase metro rail మెట్రో వాయిదాలకు బ్రేక్.. ప్రయాణికులకు శుభవార్త..

Governor narasimhan to inaugurate ameerpet lb nagar metro line on sept 24

Governor, ESL Narasimhan, inaugration, metro rail 2nd phase, ameerpet to lb nagar route, Minister ktr, twitter

Governor ESL Narasimhan to inaugrate metro rail 2nd phase project from ameerpet to lb nagar on this month 24th at 12.15, Minister ktr has tweeted this information in his twitter account

మెట్రో వాయిదాలకు బ్రేక్.. ప్రయాణికులకు శుభవార్త..

Posted: 09/19/2018 07:23 PM IST
Governor narasimhan to inaugurate ameerpet lb nagar metro line on sept 24

నగరవాసుల ఎన్నో రోజులు నిరీక్షణను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎట్టకేలకు స్వస్తిపలికేలా చేయనుంది. గత ఏడాది చివరాంకంలో ప్రారంభమైన అమీర్ పేట్ - నాగోల్, మియాపూర్ - అమీర్ పేట్ మెట్రో రైలు మార్గం తరువాత మరో అరు మాసాల్లో ప్రారంభమవుతుందని ప్రకటించినా.. అనేక వాయిదాలతో స్వాతంత్ర్య దినోత్సవానికి.. ఆ తరువాత సెప్టెంబర్ 5కు ఇలా వాయిదాలు వేసుకన్న అమీర్ పేట్ - ఎల్బీనగర్ మార్గం విషయంలో ఎట్టకేలకు మెట్రో రైల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ నెల 24న అమీర్ పేట్-ఎల్బీ నగర్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో కలసి వెళ్లిన మెట్రో రైలు అధికారులు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి ఈ విషయాన్ని చర్చించారు. మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించాలని కేటీఆర్ గవర్నర్ ను కోరడంతో ఆయన అందుకు తన సమ్మతిని తెలిపారు. ఈ నెల 24న మధ్యాహ్నం 12:15 నిమిషాలకు ఎల్బీనగర్- మియాపూర్ మెట్రో రైలు ప్రారంభం కానుందని అధికారులు గవర్నర్ నరసింహన్ తో తెలిపారు. కాగా ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

గవర్నర్ ని కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు.. సీఎస్ ఎస్కే జోషీ , మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి  అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసిన మెట్రో రైలు అధికారులు ఎల్బీ నగర్ నుంచి అమీర్ పేటకు ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రూట్ లో మెట్రో రావడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించనుందని హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles