TN BJP president meets man roughed up by Party men అటో డ్రైవర్ ఇంటికి బీజేపి లీడర్.. స్వీట్లతో సారీ.. కానీ..

Tn bjp head claims auto driver beaten up was drunk visits his house

Bharatiya Janata Party, BJP, Saidapet, Tamil Nadu BJP chief Tamilisai Soundararajan,Tamilisai Soundarajan, auto driver, chennai, Tamil Nadu,

An elderly auto driver was manhandled and allegedly assaulted by BJP members on Sunday, September 16 when he tried to ask a question about rising fuel prices to Tamil Nadu State party president Tamilisai Soundararajan, in Saidapet, Chennai.

అటో డ్రైవర్ ఇంటికి బీజేపి లీడర్.. స్వీట్లతో సారీ.. కానీ..

Posted: 09/19/2018 02:39 PM IST
Tn bjp head claims auto driver beaten up was drunk visits his house

కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ అన్ని రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటూ తమిళనాడులో మాత్రం ప్రజలకు దేరువ కావాల్సిన పార్టీ.. వివాదాల మధ్య చిక్కుకుని.. చులకన అవుతుంది. అదేంటి అంటే పార్టీ అధ్యక్షురాలి సమక్షంలోనే ఈ వివాదాలు జరగుతుండటంతో వాటిని చక్కబెట్టుకునేందుకునే పార్టీ నేతలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఇటీవల తమిళనాడు బీజేపి అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్ విమానాశ్రయంలో వెళ్తుండగా అమెను చూసిన ఓ ప్రయాణికురాలు బీజేపి పార్టీ, పార్టీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.

దీంతో అమెపై బీజేపి అధ్యక్షురాలు కూడా నోరు చేసుకోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని విడదీసి.. నినాదాలు చేసిన మహిళపై కేసు పెట్టారు. అయితే ఆ క్రమంలో సదరు ప్రయాణికురాలి తండ్రి కూడా తన కూతురును బీజేపి శ్రేణులు అసభ్యపదజాలంతో దూషించారని, చంపుతామని బెదింరించారని కేసు పెట్టినా.. అది బుట్టదాఖలైనట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజాగా తమిళసై సౌందర్యరాజన్ హాజరైన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అటో డ్రైవర్ కదీర్ పెరుగుతున్న ఇంధన ధరలపై సూటిగా ప్రశ్నించారు. దీంతో అతని సమాధానం విన్న అమె.. ఓ వెటకారపు నవ్వు నవ్వి.. మళ్లీ మీడియాతో మాట్టాడటం ప్రారంభించారు.

అయితే అమె పక్కనే ఉన్న బీజేపీ నేత కాళిదాస్ కదీర్ రెక్కపట్టుకుని బయటకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. వీడియో వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన తమిళసై నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై ఆవెనువెంటనే స్పందించిన ఆమె అటో డ్రైవర్ తాగివున్నాడని కూడా అరోపించారు. ఇక నిజం ఎంత దాస్తే మాత్రం లాభం ఏంటీ.? ఓ వైపు నెట్ జనులు ఈ ఘటనపై బీజేపిని తూర్పారబడుతూ.. మరో వైపు అటో డ్రైవర్ కు తమ సానుభూతిని ప్రకటించారు. దీంతో తప్పు దిద్దుకుని నష్ట నివారణ చర్యలకు ఆలస్యంగా పూనుకున్నారు తమిళసై సౌందర్యరాజన్.

ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి అమె క్షమాపణలు చెప్పారు. స్వీట్లు పట్టుకుని కదిర్ ఇంటికి వెళ్లి ఆమె.. కదీర్ నుంచి క్షమాపణలు వేడుకున్నారు. ఈ విషయాన్ని అమె తన సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ కదిర్ మాట్లాడుతూ.. తమిళసై మేడమ్ తన ఇంటికి వచ్చారని, కాళిదాస్ తనపై చేయి చేసుకున్న విషయం ఆమెకు తెలియదని చెప్పారని పేర్కొన్నాడు. తనకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు. పెట్రో ధరలను కేంద్రం త్వరలోనే తగ్గిస్తుందని మేడమ్ చెప్పారని కదిర్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp saidapet  chennai  auto driver  tamilisai soundararajan  apology  

Other Articles