cpm, tmaas demands assembly seat for amrutha అమృతకు అసెంబ్లీ టికెట్.. ఏకగ్రీవానికి హామీ..

Cpm tmaas assures unanimous assembly seat win for honour killing victim amrutha

pranay murder case, pranay, amrutha varshini, chada venkat reddy ,tmaas chairman kanche illaiah, murder case, ram charan tej, maruthi rao, subash sharma, mahmmad bari, aszar ali, shravan, congress leader, abdul kareem, shravan, amrutha varshini, Nakrekal MLA, Vemula Veeresham, miryalaguda, crime

cpm telanagana secretary chada venkat reddy and tmaas chairman kanche illaiah demands assembly seat and assures unanimous win for honour killing victim pranay wife amrutha varshini.

అమృతకు అసెంబ్లీ టికెట్.. ఏకగ్రీవానికి హామీ..

Posted: 09/19/2018 12:27 PM IST
Cpm tmaas assures unanimous assembly seat win for honour killing victim amrutha

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన దారుణ పరువు హత్యలో పెరుమాళ్ల ప్రణయ్ తన ప్రాణాలు కోల్పయిన ఘటనలో రోజురోజుకు కొత్త విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తుండటంతో తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం రేకెత్తిస్తు్ంది. కాగా బాధితుడి కుటుంబానికి, మరీ ముఖ్యంగా హతుడి భార్యకు అనేక మంది నుంచి పరామర్శలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో అమృత వర్షిణిని ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని సీపీఎం, టీ-మాస్ ప్రతిపాదించాయి.

ప్రణయ్ నివాసంలో అమృతను కలిసి ఓదార్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ-మాస్‌ చైర్మన్‌ కంచె ఐలయ్యలు, ఆమెను పోటీకి నిలిపితే ఏకగ్రీవం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చొరవ చూపితే స్వాగతిస్తామని అన్నారు. కుల దురహంకారానికి బలైన ప్రణయ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అదే సమయంలో అధికార పార్టీ ఈ హత్యను ఖండించకపోవడం దారుణమన్నారు.

ప్రణయ్ పై దాడి ఘటనపై కేసీఆర్ స్పందించలేదని, హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డిల్లో ఎవ్వరూ పరామర్శించడానికి రాలేదని వారు ఆరోపించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న  కాంగ్రెస్‌ నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని, కానీ నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్‌ చేయలేదదని వారు ప్రశ్నించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలయ్య డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranay  amrutha varshini  murder case  chada venkat reddy  kanche illaiah  assembly seat  crime  

Other Articles