noteban was 'biggest scam', says Rahul నవ్యాంధ్ర ప్రత్యేకహోదాపైనే తొలిసంతకం: రాహుల్

Special status is the right of andhra pradesh citizens says rahul gandhi

rahul gandhi, kurnool, ap special status, manmohan singh, narendra modi, politics, Politics of India, Nehru Gandhi family, Indian Hindus, Bharatiya Janata Party, Hindutva, Rahul Gandhi, Indian National Congress, Indian general election, Sonia Gandhi, Byreddy Convention Centre, Congress, Kiran Kumar Reddy, Reliance

Hitting out at the BJP-led NDA government at the Centre, Congress chief Rahul Gandhi on Tuesday asserted that his party was committed to granting special category status to Andhra Pradesh if elected to power in 2019.

తప్పుడు వాగ్ధానాలు చేయను.. హామీలకు కట్టుబడతాను: రాహుల్

Posted: 09/18/2018 07:06 PM IST
Special status is the right of andhra pradesh citizens says rahul gandhi

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఇది దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుక కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని రాహుల్ ఉద్ఘాటించారు. తాను తప్పుడు వాగ్దానాలు చేసే వ్యక్తిని కాదని.. ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ గడ్డపై కాలు మోపుతానని ఆయన శపథం చేశారు.

కర్నూలులో కాంగ్రెస్‌ చేపట్టి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బాకీ తీర్చాల్సిన బాధ్యత ప్రధానిగా ఎవరున్నా వారిపై ఉంటుంది. ప్రత్యేక హోదా అనేది ప్రధాని కుర్చీకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉన్న సంబంధమే. విభజన సమయంలో నవ్యాంధ్ర సంవృద్ది చెందడానికి కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు తదితర హామీలిచ్చాం. అవన్నీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పక నెరవేర్చి తీరుతామని చెప్పారు. ప్రధానిగా ఎవరు ఉన్నా.. పార్లమెంట్‌ నిర్ణయాలను అమలు చేయాల్సిందనని అయితే మోడీ మాత్రం నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

ప్రధాని మోడీని టార్గెట్ చేసిన రాహుల్

2014 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు? కానీ ఎక్కడైనా వేశారా? రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఏ ఒక్కరికన్నా ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ను దేశం విడిచి పోతున్నా.. అని విజయ్‌మాల్యా దేశ ఆర్థికమంత్రికే చెప్పి వెళ్లారు. రూ.9వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని నిలువరించే బాధ్యత దేశ ఆర్థికమంత్రికి లేదా? ఆర్థికిమంత్రికి ఆమ్యామ్యాలు అందినందువల్లే మాల్యాను దేశం దాటించారని అరోపించారు.

దేశంలో 125 కోట్ల మందికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ ఎవరికి కాపలా కాస్తున్నారో.. ప్రజలే అర్థం చేసుకోవాలని రాహుల్ వ్యంగస్త్రాలు సంధించారు. మోదీ చాలా ఆసక్తిరమైన కాపలాదారు. దొంగలకు ద్వారాలు తెరిచే కాపలాదారని విమర్శించారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోళ్లలో మోదీ అవినీతికి పాల్పడ్డారు. అనుభవం ఉన్న హెచ్‌ఏఎల్ ను కాదని అనుభవం లేని అనిల్‌ అంబానీకి కాంట్రాక్టు ఇచ్చారని అరోపించారు.

ఒక్కో యుద్ధ విమానాన్నివిలువ రూ.526 కోట్ల కాగా, వాటిని రూ.1600 కోట్లకు కొన్నారని.. ఒక్కో విమానం వెనుక 1074 కోట్ల రూపాయలను ఎవరి డబ్బని అధికంగా చెల్లింపులు చేశారని రాహుల్ ప్రశ్నించారు. అనిల్‌ అంబానీ బ్యాంకుల నుంచి రూ.45వేల కోట్లు కొల్లగొట్టారు. సాక్షాత్తూ ప్రధానమంత్రే ఒక అవినీతిపరుడు. జీఎస్‌టీ, నోట్లరద్దు నిర్ణయాలు దేశ సంక్షేమం కోసం తీసుకున్నవి కాదు. ప్రజల జేబుల నుంచి కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు వేల కోట్లు దోచిపెడుతున్నారు. మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  kurnool  ap special status  manmohan singh  narendra modi  politics  

Other Articles