Can sell petrol at Rs 35-40 per litre: Baba Ramdev పెట్రోల్ @40, డీజీల్ @35: బాబా రాందేవ్ రేట్ ఇదేనట..

Can sell petrol at rs 35 40 per litre if government permits baba ramdev

baba ramdev, ramdev petrol diesel rs 35 40, baba ramdev speech, fuel prices, ramdev on fuel prices, petrol price today, diesel price today, pm Modi, Rahul Gandhi, BJP, Congress

Buying a litre of fuel for Rs 35-40? Well, that's the price range at which Baba Ramdev, the yoga guru-turned-entrepreneur, wants to sell, If the government lets him, and gives some relief in tax.

పెట్రోల్ @40, డీజీల్ @35: బాబా రాందేవ్ రేట్ ఇదేనట..

Posted: 09/17/2018 06:13 PM IST
Can sell petrol at rs 35 40 per litre if government permits baba ramdev

యోగా గురువుగా ఖ్యాతి గడించి ఆటు పిమ్మట ఆయుర్వేద ఔషదాలను పతాంజలి పేరుతో విక్రయిస్తూ.. ఎఫ్ఎంజీసీ రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన బాబా రాందేవ్.. ఆ మధ్య పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం తనకు అనుకూలంగా నిబంధనలు మార్చని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో విసిగివేసారిన ఆయనకు కేంద్రం అండగా నిలవడంతో యోగి సర్కార్ దిగివచ్చి ఆయనకు సానుకూలంగా నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ క్రమంలో ఆయన ఒక అడుగు ముందుకేసి.. దీర్ఘాయుష్షకు దోహదపడే గంజాయి వాడకాన్ని చట్టబద్దం చేయాలని కూడా డిమాండ్ చేయడం అది కాస్తా విమర్శలకు దారి తీసింది.

ఈ వైనాన్ని దేశప్రజలు విమర్శించిన నేపథ్యంలో దానిని మర్చపోకముందే ఆయన ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని అన్నారు. దీనిని అధిగమించేందుకు తన వద్ద ఉపాయం వుందని అన్నారు. ప్రభుత్వం తనకు పన్నుల్లో కాస్త ఉపశమనం కలిగిస్తే.. తాను లీటర్ పెట్రోల్, డీజిల్ ను కేవలం రూ.35 నుంచి రూ.40కే అందిస్తానని ఆయన చెప్పడం విశేషం.

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందికి తీసుకురావాలని, అది కూడా 28 శాతం శ్లాబ్ కిందికి తీసుకురావద్దని రాందేవ్ సూచించారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. ఇక ఇతర అంశాలపైనా రాందేవ్ బాబా స్పందించారు. యువతలో అసహనం పెరిగిపోతున్నదని, అవకాశాలు లేవని వాళ్లు భావిస్తున్నారని ఆయన అన్నారు. తనకు కూడా ఎవరూ గాడ్ ఫాదర్ లేరని, అయినా తాను ఈస్థాయిలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

తాను డబ్బు వెనుక వెళ్లనని, డబ్బే తన వెనుక వస్తుంది అని రాందేవ్ బాబా అనడం విశేషం. మోదీ కొన్ని మంచి పనులు కూడా చేశారని, అయితే రాఫెల్ డీల్ లో కొన్ని రాజకీయ పరమైన ప్రశ్నలు తలెత్తిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తాను ఏ పార్టీ తరఫున లేనని, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని రాందేవ్ చెప్పారు. తానో సైంటిఫిక్ సన్యాసిని చెప్పుకోచ్చారు బాబా రాందేవ్. పతంజలిలో 300 మంది సైంటిస్టులు ఉన్నారు. చాలా నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందిస్తున్నామని రాందేవ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  baba ramdev  fuel prices  pm Modi  Rahul Gandhi  BJP  Congress  

Other Articles