Policeman carries pregnant woman to hospital ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థాన్ని చెప్పిన పోలీసు అధికారి

Policeman carries pregnant woman in his arms to hospital in mathura

uttar pradesh, mathura, mathura policeman, mathura policeman carries pregnant woman, pregnant woman viral story, policeman carries woman, policeman, policeman stories

In a heartwarming incident, a policeman carried a pregnant woman in his arms and took her to the district hospital in Uttar Pradesh’s Mathura after ambulance failed to reach her on time.

మానవత్వం పరిమళించింది: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే..

Posted: 09/17/2018 11:25 AM IST
Policeman carries pregnant woman in his arms to hospital in mathura

పోలీసులు అంటే కరుగ్గా ఉంటారనీ, సామాన్యులతో దురుసుగా ప్రవర్తిస్తారని చాలామంది సామాన్యులలో వున్న భావన. అయితే ఇలా కొందరు వ్యవహరించడంతోనే అందరూ అలానే వుంటారని అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. కానీ పోలీసులంటే అలానే కాదని మనవత్వం పరిమళించిన మహానుభావులు కూడా వుంటారని.. మరికొందరు పోలీసులు అప్పడప్పుడూ నిరూపిస్తూ.. వార్తల్లో వ్యక్తులుగా మారుతుంటారు.

ఇలాంటి ఓ పోలీస్ అధికారి ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సరికొత్త బాష్యం చెప్పాడు. తన చొరవతో నిండు గర్భిణిని అస్పత్రిలో చేర్పించాడు. తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాడు. అదెలా అంటే.. ఉత్తర్ ప్రదేశ్ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ లో సోనూకుమార్ రాజోరా పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గఢ్ గ్రామానికి చెందిన మహేశ్ తన భార్య భావన కాన్పు చేయించడం కోసం రైలులో బయలుదేరారు. రైలు మధుర కంటోన్మెంట్ వద్దకు చేరుకోగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.

దీంతో స్టేషన్ లో దిగిపోయిన మహేశ్ సాయం చేయాలని పలువురిని అర్థించాడు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీస్ అధికారి సోనూకుమార్ వద్దకు వెళ్లాడు. వెంటనే స్పందించిన సోనూ కుమార్  అక్కడకు వచ్చి అంబులెన్సుకు ఫోన్ చేశాడు. వాహనం అందుబాటులో లేదని జవాబు రావడంతో భావనను చేతులతో ఎత్తుకుని 100 మీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించడంతో భావన పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది.

ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం స్థిరంగా ఉంది. కాగా సోనూకుమార్ కు ఈ సందర్భంగా మహేశ్-భావన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయమై సోనూకుమర్ మాట్లాడుతూ.. ‘నేను నా విధిని మాత్రమే నిర్వర్తించాను. అంబులెన్సు లేకపోవడంతో ఆమెను ఆసుపత్రి వరకూ మోసుకెళ్లాను’ అని సోనూకుమార్ తెలిపారు. కాగా, ఓ పోలీస్ అధికారిగా సోనూకుమార్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonu kumar  mathura  policeman  pregnant woman  uttar pradesh  viral story  

Other Articles