BJP will fight on all seats in Telangana: Amit Shah కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు: అమిత్ షా

Bjp will fight on all seats in telangana amit shah

amit shah, amit in hyderabad, amit shah telangana, telangana elections, bjp, 2019 elections, 2019 lok sabha election, one nation one poll, kc rao, telangana government, politics

The BJP president Amit Shah claimed the Telangana government has failed at every front be it law and order or development. He also accused the TRS of doing politics of vote bank and appeasement in the state.

కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు: అమిత్ షా

Posted: 09/15/2018 04:21 PM IST
Bjp will fight on all seats in telangana amit shah

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు బీజేపి కూడా సమరశంఖం పూరించింది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్ర పర్యటను వచ్చిన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని పలు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీతో పోత్తు పెట్టుకుంటామన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. టీఆర్ఎస్ తో పోత్తు వుండబోదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. తెలంగాణలోని అన్ని స్థానాల్లో తాము బరిలో నిలుస్తామని చెప్పారు.

ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనేది తమ నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నినాదమని ఉటంకించారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలం అయ్యారని అమిత్ షా విమర్శించారు. తాము ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటామన్న షా.. తమకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రత్యర్థులేనని అన్నారు.

‘జమిలీ ఎన్నికలను ముందుగా సమర్థించిన కేసీఆర్.. ఇప్పుడు రెండు సార్లు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రజలపై కోట్ల రూపాయల భారం ఎందుకు మోపుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది తన తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కాదా.? అని నిలదీశారు. ఇది అవకాశవాద రాజకీయం కాదా కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతిలో పెట్టాలనుకుంటున్నారా? అని ఆయన నిలదీశారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్ పాలన చూస్తుంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనుకోవడం లేదని అన్నారు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?. 2014లో దళితుడే సీఎం అన్న కేసీఆర్ మాట ఏమైంది?.  2018లో అయినా దళిత సీఎం హామీ నిలబెట్టుకుంటారా? అంటూ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ విషయంలోనూ కేసీఆర్ విఫలం అయ్యారు.

ఇక ప్రగతి భవన్ నుంచే పాలన నడిపిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు పుట్టల్లో స్థానం సంపాదించారని వ్యంగవ్యాఖ్యలు సంధించారు. మూఢ నమ్మకాలతో సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆర్ ఒక్కరే. అలా చేయడం సబబేనా?. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను ప్రపంచస్థాయికి చేరుస్తామన్న హామీ ఏమైంది? టీఆర్ఎస్ పాలనలో 4,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. పంటకు మద్దతు ధర అడిగిన రైతులను ఖమ్మంలో అరెస్ట్ చేయించారు. అలాగే ఇసుక మాఫియా  ప్రశ్నిస్తే నేరెళ్లలో దళితుల్ని వేధించారు’ అని అమిత్ షా మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  telangana elections  bjp  2019 elections  KCR  Dalit CM  telangana government  politics  

Other Articles