autopsy rules out mass suicide in Burari death case బురారీ కేసు: సామూహిక ఆత్మహత్య కాదు..

Psychological autopsy rules out mass suicide in burari death case

Burari family deaths, real reason behind Burari family deaths, psychological autopsy of Burari family, mystery behind Burari family deaths, Burari family deaths case, Burari family suicide or murder, Burari family mass deaths, Delhi police, autopsy report

The psychological autopsy report of Burari mass suicide case has revealed that the eleven members of the family who were found dead at their home in July did not commit suicide.

బురారీ కేసు: సామూహిక ఆత్మహత్య కాదు..

Posted: 09/15/2018 03:05 PM IST
Psychological autopsy rules out mass suicide in burari death case

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢి్ల్లీ బురారీ ప్రాంతంలోని సామూహిక ఆత్మహత్యల కేసులో.. మరో ట్వీస్లు ఏర్పడింది. కుటుంబసభ్యులందరూ సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారని భావించినా అది వాస్తవం కాదని తాజాగా వెల్లడైంది. మోక్షం పొందడం కోసమే కుటంబసభ్యులందరూ సామూహికంగా ఆత్మహత్య పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు భావించినా.. ఈ కేసును సీబిఐ చేతికి వెళ్లిన నేపథ్యంలో వారిది ఆత్మహత్య కాదని, అయితే వారందరూ బలవన్మరణానికి పాల్పడ్డారని స్పష్టమైంది.

అయితే కుటుంబంలోని ఓ వ్యక్తి మిగతా వారిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ద్వారా తెలిసింది. అయితే ఆ 11 మంది బలవన్మరణానికి మోక్షం కోసం చేసిన క్రతువులో జరిగిన అపశృతే వారందరి ప్రాణాలను బలిగొందని సైకలాజికల్‌ ఆటాప్సీ నివేదికలో పేర్కొన్నారు. క్రతువులో భాగంగానే కుటుంబసభ్యులందరూ ఉరివేసుకున్నారని, మృతుల్లో ఏ ఒక్కరికీ చనిపోవాలన్న ఉద్దేశం లేదని నివేదిక పేర్కొంది. మృతుల ఇంట్లో లభించిన డైరీలు, స్నేహితులు, బంధువులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ నివేదికను తయారుచేశారు.

బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటనతో దేశరాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్‌ దేవీ(77), ఆమె 10 మంది కుటుంబసభ్యులు జులై 1న విగతజీవులుగా కన్పించారు. 10 మంది మృతదేహాలు ఇంటి పైకప్పునకు వేలాడుతూ ఉండగా.. నారాయణ్‌ దేవీ మృతదేహం మరో గదిలో కిందపడి ఉంది. మృతుల కళ్లకు గంతలు, చేతులు వెనక్కి కట్టి ఉండటాన్ని చూసి తొలుత పోలీసులు సామూహిక హత్యగా భావించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Burari deaths  Burari suicides  Burari  Delhi  CBI  Burari Mass suicide  Delhi police  autopsy report  

Other Articles