3 killed, 9 houses gutted in TN cracker blast చెన్నైలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి..

Three die in erode as firecrackers in vehicle suddenly burst

chennai fire accident, chennai cracker blast, Erode fire accident, Erode cracker balst, cracket blast, Tamil nadu fire accident, tamil nadu cracker blast, diwali, crackers, sivakasi, karthik, unlaoding crackers, Sasthri Nagar, erode, chennai, Tamil Nadi, Crime

Three people died and nine houses were gutted in a cracker blast in Erode city in Tamil Nadu on Wednesday morning.The accident happened when workers were unloading cracker parcels brought from Sivakasi.

చెన్నైలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి..

Posted: 09/12/2018 01:41 PM IST
Three die in erode as firecrackers in vehicle suddenly burst

తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడి పిళ్లయార్ రోడ్డులో రెండు మినీ ట్రక్కులు బాణాసంచాను దించుతుండగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బాణసంచాను లారీలోకి ఎక్కిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థంలోనే చనిపోయారు. వీరితో పాటు బాణాసంచాను దీపావళి పండగ నేపథ్యంలో విక్రయించేందుకని తెప్పించిన యజమాని కూడా అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించాడు.

బాణాసంచా విస్పోటనం దాటికి చుట్టుపక్కల ఉన్న తొమ్మిది ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, ఓ అపార్ట్ మెంట్ భవనం దెబ్బతింది. సమీపంలోని పలు వాహనాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని ఈరోడ్ ప్రాంతంలోగల శాస్త్రీనగర్ లో బుధవారం ఈ ఘటన సంభవించింది.

దీపావళి పండగను పురస్కరించుకుని ఆఫ్ సీజన్ లోనే బాణాసంచా అర్ఢర్ ను తెచ్చుకుంటే రాయితీతో తక్కువ ధరకే లభిస్తుందని స్థానికంగా నివసించే కార్తీక్ అనే వ్యక్తి వీటి కోసం అర్డర్ చేశారు. తమిళనాడులోని శివకాశీ ప్రాంతంలోని బాణాసంచా తయారీ కర్మాగారాల నుంచి తెప్పించాడు. అయితే నిన్న రాత్రే పార్శిల్ వచ్చింది, దీంతో ఇవాళ తెల్లవారు జామున వాటిని తన నివాసానికి రెండు మినీ ట్రక్కులలో లోడ్ చేసుకుని తెప్పించుకున్నాడు కార్తీక్.

రెండు ట్రక్కుల నిండా వున్న బాణాసంచాను వాటి నుంచి దింపి స్థానికంగా వున్న తన గోడౌన్ లో వాటిని పెడుతున్న క్రమంలో ఒక ట్రక్కులోని బాణాసంచా నుంచి మంటల చెలరేగాయి. క్షణాల్లో అవి వ్యాపించి బాణాసంచాను అన్ లోడ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బలితీసుకున్నాయి. ఆర్డర్ చేసిన కార్తీక్ కూడా అగ్నికి అహుతి కాగా, స్థానికులు అయనను అసుపత్రికి తరలిచగా, అక్కడ చికిత్స పోందుతూ చనిపోయాడు.

ఈ ఘటనలో స్థానికంగా వున్న తొమ్మిది ఇళ్లు, ఒక అపార్టుమెంటు కూడా ధ్వంసమయ్యింది. పలు వాహనాలు కూడా బాణాసంచా ధాటికి కొన్ని అహుతవ్వగా, మరికొన్ని దహనమయ్యాయి. నివాస సముదాయాల మధ్య బాణసంచా తయారీ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామనీ, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diwali  crackers  sivakasi  karthik  unlaoding crackers  Sasthri Nagar  erode  chennai  Tamil Nadi  Crime  

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh