nallala odelu follower gattaiah suicide attempt at indaramసుమన్ ప్రచారాన్ని అడ్డుకున్న ఓదేలు అనుచరులు

Shock to balka suman nallala odelu follower gattaiah suicide attempt at indaram

TRS shock, shock to TRS, TRS chennur Mla, nallala odelu, peddapalli MP, Balka Suman, Gattaiah, sucide attempt, chennur, KCR, TRS, telangana, politics

Shock to TRS chennur candidate and sitiing pedapalli MP Balka suman, as TRS MLA nallala odelu follower gattaiah attempted suicide after halting suman canvassing in chennur assembly constituency at indaram

టీఆర్ఎస్ కు షాక్.. సుమన్ ప్రచారాన్ని అడ్డుకున్న ఓదేలు అనుచరులు

Posted: 09/12/2018 12:41 PM IST
Shock to balka suman nallala odelu follower gattaiah suicide attempt at indaram

తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ తనకు తానుగా స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లిన చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు.. పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో దీక్ష విరమించి హైదరాబాద్ కు పయనమయ్యేందుకు రెడ్డి అయ్యారు. అటు ఓదేలు అధిష్టానం చర్యలతో దిగవచ్చారని భావించి.. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ఎంపీ బాల్క సుమన్ కు మాత్రం ఆయన అనుచరులు అడ్డుకుని షాక్ తగిలేలా చేశారు.

కొందరు పార్టీ కార్యకర్తలతో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్.. ప్రచారానికి వచ్చారన్న వార్తలను తెలుసుకున్న నల్లాల ఓదేలు అనుచరులు.. సుమన్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఆయనను దాటుకుని వెళ్లేందుకు సమన్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు యత్నించిన క్రమంలో నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య..  సుమన్ వాహనానికి ఎదురుగా వెళ్లి అడ్డుకోవడంతో పాటు  ఆత్మహత్యాయానికి పాల్పడ్డాడు.

ఒంటిపై పెట్రోల్ పోసుకున్నగట్టయ్య నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో గట్టయ్యతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఇందారం గ్రామంలో చోటుచేసుకుంది. ప్రచారానికి వచ్చిన బాల్కసుమన్ ప్రచారాన్ని ఓదేలు అనుచరులు అడ్డుకున్నారు. అంతేకాదు ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన గురించి తెలుసుకున్న ఓదేలు బాధితులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఓదేలు మద్దతుదారులు నినాదాలు చేశారు. దీంతో చెన్నూరులో పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ కు చేధు అనుభవం ఎదురైంది. మరి ఇప్పటికైనా అధిష్టానం అభ్యర్థి మార్పును చేపడుతుందా.? లేదా.,? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  shock to TRS  nallala odelu  Balka Suman  Gattaiah  chennur  KCR  TRS  telangana  politics  

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh