new twist in Kondagattu bus accident కొండగట్టు బస్సు ప్రమాదంలో కొత్త కోణాలు..

New twist in kondagattu bus accident

kondagattu bus accident, TSRTC bus accident, kondagattu rtc bus accident, RTC bus accident, Kondagattu, Jagtial accident, Kondagattu accident, kondagattu anjaneya swamy, kcr, kondagattu, p mahender reddy, TELANGANA BUS ACCIDENT, KCR, Kondagattu Hanuman, Telangana, crime

Jagitial depo manager the forced and ordered the best driver awardee srinivas to drive the bus in unfit condition, after he was opposing to do so, which killed Fifty-seven people, including several women and children at Kondagattu ghat road in Jagtial district.

కొండగట్టు బస్సు ప్రమాదంలో కొత్త కోణాలు..

Posted: 09/11/2018 09:05 PM IST
New twist in kondagattu bus accident

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఘోర ప్రమాదంలో అర్టీసి డ్రైవర్ శ్రీనివాస్ తప్పిదం ఏమీ లేదని.. అయితే అధికారులు చెప్పిన అదేశాలను ఆయన ఓ వైపు నిరాకరిస్తూనే తూచ తప్పకుండా పాటించడం వల్లే అర్టీసీ చరిత్రలో అతి పెద్ద ఘోర ప్రమాదం సంభవించిందన్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో అర్టీసీ ఉన్నతాధికారుల ఎదుటే మరణానికి కొద్దిసేపు ముందు కూడా బస్సు ఫిట్ నెస్ పై శ్రీనివాస్ నిర్భయంగా పలు విషయాలను వెలువరించారని సమాచారం.

కాసుల కక్కర్తిలో పడిన అర్టీసీ యాజమాన్యమే ఈ ప్రమాదానికి బాద్యత వహించాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ ప్రమాదానికి జగిత్యాల ఢిపో మేనేజర్ ముఖ్యకారణమని తెలుస్తుంది. ఆయన బలవంతంతోనే ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ డ్రైవర్ అవార్డును కూడా అందుకున్న డ్రైవర్ శ్రీనివాస్ బస్సును నడపారని.. చివరకు తన ప్రాణాలను పణ్ణంగా పెట్టినా.. అదుపు తప్పిన బస్సులో భక్తులు కిక్కిరిసి పోవడంతో ఈ ప్రమారం సంభవించిందని ఆయన అధికారులకు వివరించారని తెలుస్తుంది.

దీంతో పాటు ఢిపో మేనేజర్ అదేశాల మేరకే తాను నిత్యం ప్రయాణించే రోడ్డులో కాకుండా షార్ట్ కట్ రోడ్డు లో కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా బస్సును నడపాల్సి వచ్చిందని కూడా ఆయన తెలిపినట్లు సమాచారం. డ్రైవర్ శ్రీనివాస్ కుటింబికులు, బంధువులు మాత్రం.. బస్సుకు ఫిట్ నెస్ లేదని, అందుచేత తాను విధులకు హాజరుకానని డ్రైవర్ శ్రీనివాస్ నిరాకరించారని అయినా డీఎం ఫోన్ చేసి అదేశించడంతోనే విధులకు హాజరయ్యారని తెలిపారు. ప్రమాదం సంభవించిన నేపథ్యంలో జగిత్యాల డిఫో మేనేజర్ ను అర్టీసీ సస్పెండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kondagattu  Hanuman Temple  TSRTC Bus  Accident  KCR  Telangana crime  

Other Articles