తన వయోభారంతో పాటు వృధ్దాప్యంలో వచ్చిన అనారోగ్య సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని తన శిక్షా కాలాన్ని తగ్గించాలని కోరుతూ అత్యాచార కేసులో దోషిగా తేలి..జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఆశారాం బాపు(77) రాజస్థాన్ గవర్నర్ కు మొర పెట్టుకున్నారు. అంతకు ముందే జులై 2న తన శిక్షాకాలాన్ని తగ్గించాలని కోరుతూ ఆశారాం హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఇప్పటి వరకూ ఆ పిటిషన్ పై ఎటువంటి వాదనలు చేపట్టకపోవడంతో ఆయన గవర్నర్ కు మొరపెట్టుకున్నారు
ఆశారాం బాపు పిటిషన్ ను స్వీకరించిన గవర్నర్ కల్యాణ్ సింగ్ దానిపై పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆ రాష్ట్ర హోంశాఖను ఆదేశించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హోంశాఖ పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు సూచించింది. దీనిపై జిల్లా అధికారులు, పోలీసులతో నివేదిక తెప్పించుకుని పరిశీలన జరుపుతున్నామని జోధ్ పూర్ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కైలాశ్ త్రివేది తెలిపారు. సమగ్ర నివేదికను జైళ్ల శాఖ డీజీకి పంపనున్నామని ఆయన తెలిపారు.
ఓ మైనర్ ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆయన శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 2013 ఆగస్టు 15న జోధ్ పూర్ కు సమీపంలోని మనాయ్ ప్రాంతంలోని ఆశ్రమంలో ఆశారాం బాపు తనపై అత్యాచారం చేశాడని బాలిక పిర్యాదు చేసిన క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. యూపీలోని షాజహాన్ పూర్ కు చెందిన ఆ బాలిక మధ్యప్రదేశ్ లోని ఆశారాం బాపు అశ్రమంలో విద్యబ్యాసం చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగ్గా.. ఆశారాంను న్యాయస్థానం ఏప్రిల్ 25న దోషిగా నిర్థారిస్తూ జీవిత ఖైదు విధించింది.
(And get your daily news straight to your inbox)
Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్... Read more
Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more
Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more
Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more
Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more