congress alleges TRS vendetta politics జగ్గారెడ్డికి ‘నో’ బెయిల్.. ఇక తాజగా గండ్ర వంతు..

After jagga reddy its gandra venkatramana turn case against another congress leader

jagga reddy, gandra venkat ramana reddy, gandra venkatramana reddy death warning case, errabelli ravinder rao, jagga reddy arrested, jagga reddy fake passport, telangana jagga reddy, jagga reddy fake visa, jagga reddy usa 2004, human trafficking, forgery, dcp sumathi, uttam kumar reddy, kuntia, congress, political vendata, trs, minority meet, arrest, telangana congress, telangana news, telangana politics

After Former MLA and senior Telangana Congress leader K Jagga Reddy has been send to 14 days judicial remand, and denied bail in fake passport and a visa case its now the turn of Gandr venkatamana reddy, who has been booked for death threat.

జగ్గారెడ్డికి ‘నో’ బెయిల్.. ఇక తాజగా గండ్ర వంతు..

Posted: 09/11/2018 06:08 PM IST
After jagga reddy its gandra venkatramana turn case against another congress leader

మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు చేసి.. కోర్టు అదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిన తరువాత తాజాగా మరో కాంగ్రెస్ సీనియర్ నేతపై కేసు నమోదైంది. ఆయనపై శాయంపేట పోలీస్ స్టేషన్లో బెదిరింపుల కేసు నమోదయింది. ఐదు సెక్షన్ల కింద గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు ఆయన సొదరుడు గండ్ర భూపాల్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక క్రషర్ యజమానిని చంపుతామని బెదిరింపులకు పాల్పడటంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ మేరకు స్థానిక క్రషర్ యజమాని ఎర్రబెల్లి రవీందర్ రావు శాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుపాకీతో బెదిరిస్తూ తనను భయాందోళనకు గురిచేస్తున్నారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీంధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు గండ్ర సోదరుల నుండి రక్షణ కల్పించాలంటూ రవిందర్ రావు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు. ఐదు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫేక్ పాస్ పోర్టులతో ముగ్గురు వ్యక్తులను జగ్గారెడ్డి అమెరికా పంపించినట్లుగా పోలీసుల అభియోగాలు మోపి అరెస్టు చేసిన కేసులో ఆయన తరపు న్యాయవాదులు మాత్రం ఎన్నికల సమయంలో కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగ్గారెడ్డిని అరెస్టు చేశారని వాదించారు. అయినా న్యాయస్థాం రిమాండ్ విధించిన క్రమంలో జగ్గారెడ్డి తరపు న్యాయవాదులు ఆయన బెయిల్ ఇవ్వాలన్న పిటీషన్ ను న్యాయస్థానం ముందుకు తీసుకురాగా, న్యాయస్థానం బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  gandra venkat ramana reddy  uttam kumar reddy  kuntia  congress  political vendata  

Other Articles