Pawan Kalyan announces his jana sena first candidate name జనసేన తొలి అభ్యర్థి పేరును ప్రకటించిన పవన్

Pawan kalyan announces his jana sena first candidate name

pawan kalyan, janasena, Pithani Balakrishna, East Godavari, Pawan Kalyan Pithani Balakrishna, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan announces his party's first candidate name. Pithani Balakrishna will contest from Janasena from Mammidivaram constituency in East Godavari district.

జనసేన తొలి అభ్యర్థి పేరును ప్రకటించిన పవన్

Posted: 09/11/2018 05:22 PM IST
Pawan kalyan announces his jana sena first candidate name

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వినూత్న రీతిలో తన ప్రచారాన్ని చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ అభ్యర్థులను ఉత్కంఠకు గురిచేసిన తరువాత అభ్యర్థుల జాబితాలను వెలువరించే పార్టీలకు భిన్నంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. జనసేన పార్టీ తొలి అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ నుంచి  మొట్టమొదటి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణకేనని ప్రకటించారు.

హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులతో జరిగిన సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రకటన చేశారు. వైసీపీ మాజీ నేత పితాని బాలకృష్ణకు పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా చేశారని, తన తండ్రి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని, తమది ‘పోలీస్ కులం’ అని చెప్పి నవ్వులు చిందించారు. పితానిని చూడగానే ఆయనకు టికెట్టు ఇవ్వాలనిపించిందని, ఆయన భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అందుకని, పితాని బాలకృష్ణను ‘జనసేన’ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.   

అనంతరం, పితాని బాలకృష్ణ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘వంచనకు గురైన తనకు ఎవరూ లేరని, తనను చిన్నచూపు చూశారని... పవన్ కల్యాణ్ మాత్రమే తనను ఆదరించి అక్కున చేర్చుకున్నారని.. ఈ పార్టీలో బాధ్యతలు అప్పజెప్పారని చెమ్మగిల్లిన కళ్లతో బావోద్వేగానికి గురైన పితాని తెలిపారు. అతి పేద కుటుంబం నుంచి వచ్చానని, చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకునే వాడిని. ఏదో భగవంతుడి దయవల్ల, అంచెలంచెలుగా ఎదిగా. నా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశానని చెప్పారు.

అమ్మోరు దయవల్ల.. ఐశ్వర్యం లభించిందని.. పది మందికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న తనను ఓ మోసపూరితమైన నాయకుడు వంచించాడన్నారు. తనకు టికెట్ ఇస్తాను రమ్మనమని చెప్పి.. తన ఉద్యోగానికి రాజీనామా చేయించాడని. నన్ను మోసం చేశాడని.. తన అవేదనను వ్యక్తం చేశారు. అదే క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఆలోచించాల్సిన అవసరం వుందని అన్నారు. విశ్వసనీయత, మాటతప్పడం, మడమ తిప్పడం..అనేవి పైకి షోయింగ్ లు తప్ప, లోపలంతా దుర్మార్గం, కుట్ర, కుతంత్రం. ఈ కౌగిలించుకోవడాలు, ముద్దుపెట్టుకోవడాలు అంతా మోసం.. ఎవరూ నమ్మకండి!’ అని ఘాటు విమర్శలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  east godavari  Pithani Balakrishna  first candidate  andhra pradesh  politics  

Other Articles

 • Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

  ‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

  Jul 18 | అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు... Read more

 • Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

  కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

  Jul 17 | ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు... Read more

 • Supreme court to take decision on petition of karnataka rebel mlas today

  కర్ణాటక సంక్షోభం.. కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం!

  Jul 17 | మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందా? తీర్పు ఎలా ఉండబోతోంది? దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు ఇవాళ బ్రేక్ పడే అవకాశాలు... Read more

 • Trafic challans on violation of motor vehicle rules

  బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

  Jul 16 | ఎన్నాళ్ల నుంచో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న అధిక జరిమానాల పోటు బిల్లు పార్లమెంటులోకి వచ్చి చేరింది. దీంతో ఎన్ని తప్పులు చేసినా ఇన్నాళ్లు పోతే కొంతేగా అని యధేశ్చగా తప్పులను చేసినా వారి గుండెల్లో ఇక... Read more

 • Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

  ఏపీకి కొత్త గవర్నర్‌

  Jul 16 | ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర... Read more

Today on Telugu Wishesh