toll rose to 54 in Kondagattu bus tragedy ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం.. రూ.10లక్షల పరిహారం..

Major accident in rtc history at kondagattu toll rose to 54

kondagattu bus accident, TSRTC bus accident, kondagattu rtc bus accident, RTC bus accident, Kondagattu, Jagtial accident, Kondagattu accident, kondagattu anjaneya swamy, kcr, kondagattu, p mahender reddy, TELANGANA BUS ACCIDENT, KCR, Kondagattu Hanuman, Telangana, crime

Fifty-Four people, including several women and children, were killed, and many suffered injuries on Tuesday morning when a TSRTC bus plunged into a gorge on the Kondagattu ghat road in Jagtial district.

ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం.. రూ.10 లక్షల పరిహారం..

Posted: 09/11/2018 04:37 PM IST
Major accident in rtc history at kondagattu toll rose to 54

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అడపాదడపా అర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా ఇంత పెద్ద సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపిన ఘటన మాత్రం ఇదే. జగిత్యాలకు చేరువలోని కొండగట్టులో వున్న అంజనేయస్వామి దేవాలయానికి భక్తులతో కిక్కిరిసి వెళ్తున్న ఆర్టీసి బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య యాభై నాలుగుకు చేరింది.

కొద్దిసేపటి క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి క్షతగాత్రుడైన బస్సు డ్రైవర్ శ్రీనివాస్ అసుప్రతిలో చికిత్స పోందుతూ మృతిచెందాడు. దీంతో బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 54కు చేరింది. ప్రమాద మృతుల్లో నలుగురు చిన్నారులతో పాటు 32 మంది మహిళలు, 15 మంది పురుషులు వున్నారు. క్షతగాత్రులైన వారిని స్థానిక జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిని వారిని హైదరాబాద్, కరీంనగర్ అసుపత్రులకు కూడా తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో 85 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తుంది. ప్రమాదం తీవ్రస్థాయిలో వుందని తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. స్థానిక అసుపత్రులలో చికిత్స పోందుతున్న బాధితులను మంత్రులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.

ఇదిలావుండగా బస్సు ప్రమాదానికి కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సులను అనుమతించే దారి నుంచి కాకుండా షార్ట్ కట్ రూట్ అయిన ఘాట్ రోడ్డులోంచి వెళ్లడం కారణమని భావిస్తున్నారు. ఇక బస్సును గేర్ లో కాకుండా న్యూట్రల్ గేర్ లో కిందకు తీసుకురాడం.. అదే సమయంలో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ వద్ద కూడా బ్రేకులు వినియోగించకపోవడం.. దాంతో బస్సు పైకి ఎగరి పటడం.. బస్సులు అధిక సంఖ్యలో ప్రయాణికులు వుండటం వల్ల బస్సు ఎగిరి పక్కకు జారిందని.. అదే సమయంలో బస్సు రోడ్డుకు అడ్డుగా వున్న రేయిలింగ్ ను చీల్చుకుంటూ లోయలోకి పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే బస్సు ప్రమాదంపై డ్రైవర్ శ్రీనివాస్ కుటింబికులు, బంధువుల వాదన మరోలా వుంది. బస్సుకు ఫిట్ నెస్ లేదని, అందుచేత తాను ఇవాళ విధులకు హాజరుకానని డ్రైవర్ శ్రీనివాస్ విధులకు హాజరయ్యేందుకు కూడా మారం చేశాడని వారు తెలిపారు. అయితే.. డీఎం తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సిందేనంటూ అదేశాలు జారీ చేయడంతోనే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరయ్యాడని శ్రీనివాస్ కుటింబికులు తెలిపారు. అయితే ప్రమాదం సంభవించిన క్రమంలో ఇప్పుడు అధికారులు మాటమారుస్తున్నారని వారు అరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kondagattu  Hanuman Temple  TSRTC Bus  Accident  KCR  Telangana crime  

Other Articles