సినీ ఫక్కీలో పోలీస్ స్టేషన్ లోని పోలీసులపై దాడి చేసిన ఓ నిందితుడు ఠాణా నుంచి పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పాతికేళ్ల అగంతకుడు అర్థరాత్రి వేళ పోలిస్ స్టేషన్లో వున్న హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో పాటు సెంట్రీ విధుల్లో వున్న కానిస్టేబుల్ పై విచక్షణ రహితంగా దాడి చేసి స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడు. పోలిస్ స్టేషన్ లోని ఉక్కు నాగలి అకారంలో వున్న వస్తువును చేతబట్టుకుని ఇద్దరి పోలీసులను ఒక్కో ఏటు వేసి వారు అపస్మారకస్థితిలోకి జారుకోగానే తప్పించుకుపోయాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని భిండ్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
భిండ్ జిల్లా ఉమ్రీ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఠాణా ఇంచార్జీ సిపీఎస్ చౌదరి తెలిపిన ప్రకారం ఇలా వున్నాయి. ఉమ్రిలోని స్థానిక మార్కెట్ వద్ద నానా హంగామా చేస్తున్నట్లు పిర్యాదులు రావడంతో అక్కడికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ బాబు.. హంగామా చేస్తున్న పాతికేళ్ల అగంతకుడు విష్ణు రాజ్వత్ తో పాటు అతని స్నేహితుడు మన్ సింగ్ రాజ్ పుత్ లను అదుపులోకి తీసుకుని స్టేషన్ వచ్చాడు. స్టేషన్ లో వారిని కూర్చోబెట్టి హెడ్ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రాస్తువున్నాడు.
అయితే సెంట్రీగా విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ గజరాజ్ కూడా అర్థరాత్రి కావడంతో ఎవరూ లేరని హెడ్ కానిస్టేబుల్ వద్దకు చేరుకుని ఆయన పక్కనే కూర్చున్నాడు. అదను కోసం వేచి చూసిన విష్ణు.. స్టేషన్ లోని ఓ మూల వున్న ఉక్కు నాగలి ఆకారంలోని ఆయుధాన్ని చేతిలోకి తీసుకుని దాంతో ముందుగా హెడ్ కానిస్టేబుల్ తలపై వెనుకగా వస్తూనే వేటు వేయడంతో ఆయన వెంటనే సృహకొల్పోయాడు. ఏం జరిగిందని చూసే లోపు కానిస్టేబుల్ గజ్ రాజ్ ను కూడా అదే ఆయుధంతో తలపై మోదాడు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంలో విష్ణు తప్పించుకుని పారిపోయాడు.
#WATCH Dramatic visuals of an undertrial prisoner viciously attacking two prison guards at a police station in Bhind on 9th September. One police personnel has been referred to Delhi for treatment, another is under treatment at a district hospital in Bhind (Source: CCTV footage) pic.twitter.com/eXEQ5eH51y
— ANI (@ANI) September 11, 2018
పెట్రోలింగ్ విధులు ముగించుకుని వచ్చిన పోలీసులు ఘటనను చూసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అసలేం జరిగిందన్న వివరాలను తెలుసుకునేందుకు సిసిటీవీ ఫూటేజీని పోలీసులు పరిశీలించగా ఈ దారుణ ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు పోలీసులు బాధ్యతారాహిత్యం అంటుండగా, మరికొందరు మన చట్టం కల్పిస్తున్న అవకాశమంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, పరారైన నిందితుడు విష్ణుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడ్ని పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. ఇక ఉమేష్ ను చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించగా.. మరో వ్యక్తిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్... Read more
Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more
Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more
Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more
Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more