Jagga Reddy remanded to 14 days judicial custody జగ్గారెడ్డికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్..

Congress leader jagga reddy remanded to 14 days judicial custody

jagga reddy, dcp sumathi, uttam kumar reddy, congress, minority meet, arrest, fake passport, human trafficking, political vendata, telangana goverment

Former MLA and senior Telangana Congress leader K Jagga Reddy has been send to 14 days judicial remand in chenchalguda jail, for allegedly carrying a fake passport and a visa.

జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్.. కక్షసాధింపే అంటున్న కాంగ్రెస్

Posted: 09/11/2018 12:16 PM IST
Congress leader jagga reddy remanded to 14 days judicial custody

మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు చేసిన నార్త్ జోన్ పోలీసులు ఇవాళ ఉదయం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆయనను చంచల్ గూడ జైలుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపింది. ఫేక్ పాస్ పోర్టులతో ముగ్గురు వ్యక్తులను జగ్గారెడ్డి అమెరికా పంపించినట్లుగా పోలీసుల అభియోగాలు మోపారు. కాగా, జగ్గారెడ్డిని అరెస్టు అక్రమమని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. జగ్గారెడ్డిపై తెలంగాణా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకిందే అరెస్టు చేసిందని, దీంతో ఆయనకు తక్షణం బెయిలు మంజూరు చేయాలని కూడా ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అశ్రయించారు.

2004లో జగ్గారెడ్డి తనతో పాటు భార్య, పిల్లల పేరుమీద పాస్ పోర్టులు తీసుకుని వేరొకరిని అమెరికా తీసుకెళ్లినట్లు గుర్తించామని డీసీపీ సుమతి మీడియా సమావేశంలో తెలిపారు. ఆయనతో పాటు వెళ్లింది ఎవరో గుర్తించాల్సి ఉందని.. వారు తెలంగాణకు చెందిన వారు మాత్రం కాదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్ స్టేషన్‌ ఎస్ఐ అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు దీనిపై కేసు నమోదు చేశామన్నారు. పాస్ పోర్టులో జగ్గారెడ్డి భార్య పోటో, పిల్లల పుట్టిన తేదీలు మార్పిడి జరిగిందని తెలిపారు.

అక్రమంగా తరలించిన ముగ్గురి నుంచి జగ్గారెడ్డి లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించామని.. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారని డీసీపీ తెలిపారు. ఆయనపై అధికార దుర్వినయోగం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఉదయం గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో ఆయనను హాజరుపర్చారు.

కాగా, రాజకీయ కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పేర్కోంది. జగ్గారెడ్డిని నేరుగా ఎదుర్కోనే దమ్ము, ధైర్యం కేసీఆర్ ప్రభుత్వానికి లేక.. అదనుకోసం వేచి చూసిన ప్రభుత్వం కుతంత్రంతో సరిగ్గా ఎన్నికల సమయంలో అక్రమ కేసులు బనాయించి ఆయనను అరెస్టు చేసిందని అరోపించింది. పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  నిజంగా ప్రభుత్వానికి అంత చిత్తశుద్దే వుంటే.. గతంలో అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పరపతిని వినియోగించి అక్రమ మనుషుల రవాణ చేశారన్న అభియోగాలు గతంలో తెరపైకి వచ్చాయని తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీలో వున్న నేతలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ.. కాంగ్రెస్ లో వున్న నేతలపై మాత్రమే అక్రమ కేసులను బనాయిస్తుందని అరోపించారు. అక్రమ రవాణా కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న టీఆర్ఎస్ నేతలందరినీ అదుపులోకి తీసుకుని విచారించే సాహసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయగలదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిని పోలీసులు సివిల్ డ్రెస్‌లో వచ్చి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 2004లో తప్పుడు పత్రాలు సమర్పిస్తే అధికారులు ఇప్పటి వరకు ఏం చేశారని నిలదీశారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని ఉత్తమ్ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles