హైదరాబాద్ మహానగరంలోని ఈశాన్య, నైరుతి ప్రాంతాల్లో విషాదం అలుముకుంది. నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురి జీవితాలను అర్థంతరంగా చిదిమేయగా, మరో ఘటనలో ఉప్పల్ కు చేరువలోని రామంతపూర్ లో దుకాణం నుంచి తన తండ్రి చేయి పట్టుకుని ఇంటికి వెళ్తున్న ఓ ఐదేళ్ల చిన్నారి జీవితాన్ని మృత్యుశకటంలా వచ్చిన అటో చిదిమేసింది.
గచ్చిబౌలిలోని ఘటనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో దశరథ్ అనే ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసలుఉ విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ఇక మరో ఘటనలో ఉప్పల్ పొలిస్ స్టేషన్ పరిధిలో ఆటో ఢీకొన్ని ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. పూర్తిగా మద్యం మత్తులో వున్న అటో డ్రైవర్ తన అటోపై నియంత్రణ కొల్పోవడంతో రామంతాపూర్ శారదనగర్ కాలనీకి చెందిన ఉమేష్ భార్య పిల్లలతో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. రోడ్డుపై నడుస్తుండగా వేగంగా వస్తున్న ఆటో వీరిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఉమేష్ కు స్వల్పగాయాలవ్వగా... చిన్నారి మోహిత్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మోహిత్ ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న బైక్ ను తప్పించే క్రమంలో ఆటోడ్రైవర్ వాహనాన్ని పక్కకు తీసుకురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆటోడ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్... Read more
Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more
Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more
Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more
Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more