actress ramya hillarous tweets on raising petrol prices ఇంధన ధరలపై నటి రమ్య ట్వీట్లు..

Actress ramya hillarous tweets on raising petrol prices

actress ramya, actress divya spandana, ramya hillarous tweets, ramya tweets on petrol prices, ravindra jadeja, petrol high scorer, petrol price tops frist place, UPA pertrol prices, UPA oil prices, six pack amirkhan, NDA oil prices, grown belly, PM Modi, Oil companies

actress ramya hillarous tweets on raising petrol prices, In a tweet she says ravindra jadeja is second but petrol price is frist, and in another during UPA pertrol prices are fit like six pack amirkhan, but during NDA its like unfit amir with grown belly.

ఇంధన ధరలపై నటి రమ్య ట్వీట్లు.. పొట్టచెక్కలు..

Posted: 09/10/2018 01:11 PM IST
Actress ramya hillarous tweets on raising petrol prices

మునుపెన్నడూ లేనంతగా అంతకంతకూ పెరుగుతూ జీవితకాల గరిష్ట స్థాయి రికార్డుతో దూసుకుపోతున్న ఇంధన ధరలపై ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా అటు భారత్ బంద్ కొనసాగుతున్న క్రమంలో ఎవరికి తోచిన విధంగా వారు పెరుగుతున్న ఇంధన ధరలపై వారి అలోచనలను నెట్టింట్లో పెట్టి సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కన్నడ నటి, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రమ్య తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు.

తనలోని హాస్యకోణంలో వీటిని అమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసినా అది మాత్రం ప్రభుత్వంపై వ్యంగప్రచారానికి దొహదపడుతున్నాయి. ఆ ట్వీట్లను చదివిన నెటి జనులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇంతకీ అమె పెట్టిన పోస్టుల వివరాలేంటరా.? టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చివరి టెస్టులో సాధించిన అత్యధిక స్కోరు కంటే పెట్రోల్ ధరలే ఎక్కువగా ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. రవీంద్ర జడేజా 86 పరుగులు చేసి రెండో స్థానంలో నిలువగా, పెట్రోల్ ధరలు మాత్రం 87కు చేరి మొదటి స్థానం అక్రమించాయని అమె వ్యంగంగా చేసిన పోస్టు నెట్ జనులను నవ్విస్తుంది.

ఇంధన ధరలపై ప్రతిపక్ష పార్టీలు ఇవాళ భారత్ బంద్ చేపట్టిన నేపథ్యంలో ఆమె ట్విటర్లో స్పందిస్తూ... ‘‘86 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అత్యధిక స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే రూ.87కు దూసుకెళ్లిన పెట్రోల్ అంతకంటే టాప్‌లో కొనసాగుతోంది...’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ మాదిరిగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయంటూ ఆమె పోస్టు చేసిన మరో ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. యూపీఏ హయాంలో అమిర్ ఖాన్ సిక్స్ ప్యాక్‌లో కనిపించినట్టు పెట్రోల్ ధరలు ఉన్నాయనీ.. ఎన్డీయే హయాంలో దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ లా ధరలు పెరిగాయని ఆమె పోల్చి చెప్పడంతో నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress ramya  divya spandana  oil prices  amir khan  ravindra jadeja  Oil companies  UPA  NDA  

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh