Sexual harassment as bad as a bribe? మరింత శక్తివంతంగా అవినీతి నిరోధక చట్టం..

Seeking sexual favours will count as bribe under new anti corruption law

corruption, ‘undue advantage’, new anti-corruption law, sexual favours, club membership, hospitality, sexual harassment, Prevention of Corruption Act, bribery, bribe, crime

Seeking and accepting sexual favours could be considered a crime under the new anti-corruption law and persons convicted of this crime could be jailed for up to seven years.

అవినీతి నిరోధక చట్టంలోకి.. అనుచిత ప్రయోజనం..

Posted: 09/10/2018 12:34 PM IST
Seeking sexual favours will count as bribe under new anti corruption law

ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలోని వారైనా.. ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాల్సిందే. ఎందుకంటే అవినీతి నిరోధక శాఖ సిఫార్సుల మేరకు సవరణలు జరిగిన అనంతరం కొత్తరూపు దాల్చిన ఈ చట్టం మరింత శక్తివంతంగా మారింది. ఈ చట్టంలో అనుచిత ప్రయోజనాలు అన్న పదం అత్యంత శక్తివంతంగా మారింది. భవిష్యత్తులో ఈ పదం లంచావతారాల భరతం పట్టేందుకు దొహదపడనుంది. కీలకమైన పనులను అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు లైంగిక సేవలను బలవంతంగా కొరిన అధికారులకు ఇప్పటికైనా తమ పద్దతి మార్చుకోవాల్సిందే. లేదంటే అరున్నోక్క ఏఢాది పాటు కటకటాలు లెక్కబెట్టాల్సిందే.

అవినీతి చట్టంలో లైంగిక సేవలను లంచంగా కోరుకోవడం ఇన్నాళ్ల పాటు స్థానం కల్పించకపోవడంతో అలాంటి పనులను అలవాటు పడిన అధికారులతో పాటు డబ్బు రూపంలో కాకుండా అస్తుల రూపకంగానూ కాకుండా.. మరో రూపంలో లంచాలకు అలవాటు పడిన అధికారులకు పాలిట ఇకపై అవినీతి నిరోధక చట్టం పశుపతాస్త్రంలా పరిణమించనుంది. ఇకపై ఎవరైనా ఇలాంటి వాటిని ఆఫర్ చేస్తే, వాటిని అంగీకరించి వారికి అవసరమైన పనులు చేసిపెట్టడం వంటివి ఇకపై నేరాలే. అవినీతి నిరోధక సవరణ చట్టం-2018

ప్రకారం, అనుచితమైన ప్రయోజనాలు పొందడం శిక్షార్హమైన నేరం. దీనికి గరిష్ఠంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ చట్టంపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం కూడా పెట్టేశారు. మూడు దశాబ్దాల నాటి అవినీతి నిరోధక చట్టాన్ని మరింత శక్తిమంతం చేస్తున్న ఈ సవరణల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా లైంగిక సేవలను పొందినా, విలాసవంతమైన క్లబ్బుల్లో సభ్యత్వాలు, ఖరీదైన ఆతిథ్యాలు పొందినా కేసులను ఎదుర్కోవాల్సివుంటుంది. బంధువులు, స్నేహితులు, ఇతరులకు సాయం చేసి, వారి నుంచి అనుచిత ప్రయోజనం పొందినా, ఈ చట్టం ప్రకారం శిక్షార్హులే. విహార యాత్రలకు వెళ్లేందుకు టికెట్లను బహుమతిగా పొందినా నేరమే అవుతుందని, 'అనుచిత ప్రయోజనం' అన్న పదం రాబోయే రోజుల్లో విస్తృత రూపం సంతరించుకుని చట్టం అమలుకు దోహదపడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Pawan kalyan s janasena releases new bonalu song

    ITEMVIDEOS: బోనాల సందర్భంగా తెలంగాణవాసులకు పవన్ కల్యాణ్ గిఫ్ట్.!

    Jul 20 | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినా.. ఉనికిని మాత్రం నిలుపుకుంటుందని పార్టీశ్రేణులతో పాటు జనసైనికులు, పార్టీ ప్రముఖులు కూడా ఆశించారు. అయితే అందుకు భిన్నమైన ఫలితాలు రావడం.. అనేక... Read more

  • 9 people dead on spot in road accident on pune solapur highway

    9 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న లారీ..

    Jul 20 | అతివేగం తొమ్మిది మంది విద్యార్థుల ప్రాణాలను బలిగోన్న ఘటన మహారాష్ట్రలోని పూణె శివార్లలో శనివారం వేకువ జామున జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మది మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.... Read more

  • Sasural simar ka child actor shivlekh singh dies in a road accident near raipur

    రోడ్డు ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం

    Jul 19 | పలు హిందీ సీరియల్స్‌లో నటించి బాల నటుడు మంచి పేరు తెచ్చుకున్న శివలేఖ్ సింగ్(14) ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, అతని... Read more

  • Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

    ‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

    Jul 18 | అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు... Read more

  • Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

    కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

    Jul 17 | ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు... Read more

Today on Telugu Wishesh