BJP MLA abusing lady cop in Rudrapur నెట్టింట్లో బీజేపి ఎమ్మెల్యే ప్రవర్తన వైరల్..

Bjp mla rajkumar thukral abuses lady cop in rudrapur

bjp mla warns cop, bjp mla rude behaviour, rajkumar thukral misbehaviour, sub inspector of city patrol unit, traffic violations, rudrapur, politician abuses, bjp mla, rajkumar thukral, uttarakhand, mla misbehaves with cop, raj kumar thukral, si anita gairola, detention, rudrapur, uttarakhand, crime

A video of BJP MLA Rajkumar Thukral abusing a lady cop has gone viral on social media. The incident took place in Rudrapur, when sub-inspector Anita Gairola arrested a man for not having proper papers of his bike.

ITEMVIDEOS: నెట్టింట్లో బీజేపి ఎమ్మెల్యే ప్రవర్తన వైరల్.. చూడండీ..

Posted: 09/10/2018 11:42 AM IST
Bjp mla rajkumar thukral abuses lady cop in rudrapur

అధికార పార్టీ చెందిన కార్యకర్తలు, నాయకులకే పోలీసులు సలామ్ చేస్తున్న రోజులువి. ఇక అలాంటిది ఓ అధికార ప్రజాప్రతినిధి అందులోనే అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే చట్టం జేబులో చుట్టంగా మారిపోతుందని ఇప్పటికే అనేక ఘటనలు మనకు నిరూపించాయి. ఇక దేశవ్యాప్తంగా రెండు పదుల రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి కొత్తగా వచ్చిన అధికారపు రెక్కలు మాత్రం వారిని విమర్శల పాటు చేస్తున్నాయి. బీజేపి ఎమ్మెల్యేల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. అటు జాతీయవాదం, ఇటు హిందూ ధర్మం అంటూ చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు.. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను కూడా చెవికెక్కించుకోవడం లేదు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న ప్రధాని చెప్పిన వ్యాఖ్యలను విస్మరిస్తూ ఓక్కో నేత ఒక్కో తరహాలు వివాదాస్పద వ్యాక్యలు చేస్తూ పార్టీ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. మొన్న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మల్యే రామ్ కదమ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మర్చిపోకముందే ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ పోలీస్ స్టేషన్‌లో వీరంగమేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌ అనితా డైరోలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు తిట్టారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్‌ ఆవరణలోనే ఇష్టానుసారం మాట్లాడారు.

ఓ వాహనంపై వెళ్తున్న జంటను ఆపిన అనిత వాహన పత్రాలు చూపించమని అడిగారు. వారు చూపించకపోవడమే కాకుండా ఎస్సైను దుర్భాషలాడారు. దీంతో ఆమె వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్నిపోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన తుక్రాల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి అనితపై రెచ్చిపోయారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సదానంద దాతె మాట్లాడుతూ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : raj kumar thukral  si anita gairola  detention  rudrapur  uttarakhand  crime  

Other Articles