Tollywood mourn for demise of Harikrishna హరికృష్ణ మరణంతో విషాదంలో టాలీవుడ్..

Tollywood mourn for the demise of nandamuri harikrishna

nandamuri harikrishna, nandamuri harikrishna dead, nandamuri harikrishna car crash, Jr, NTR, Kalyan Ram, Janaki Ram, Mahesh babu, Ram charan, varun tej, sai dharam tej, manchu manoj, akkineni nagarijuna, allu arjun, Nani, devi sri prasad, mohan babu, manchu lakshmi, rakul preet, radhika sharat kumar, gautami, tollywood, cine celebs, social media

Following news of the death of actor-politician Nandamuri Harikrishna, Tollywood mourn for his demise, celebrities expressed their condolences on social media.

హరికృష్ణ మరణంతో విషాదంలో టాలీవుడ్.. ప్రముఖుల సంతాపం..

Posted: 08/29/2018 11:56 AM IST
Tollywood mourn for the demise of nandamuri harikrishna

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమి విషాదంలో మునిగిపోయింది. ఆయన హఠాన్మరణాన్ని ఇంకా నమ్మలేకపోతున్నామని, ఇది నిజమేనా అన్న షాక్ లో వుంది టాలీవుడ్ పరిశ్రమ. ఈ వార్తను నందమూరి అభిమానులు ఇంకా జీర్ణంచు కోలేకపోతున్నారు. దుర్మరణం పాలయ్యారు. నల్గోండ జిల్లా అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారన్న వార్త తమను తీవ్రంగా బాధిస్తుందని తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. హరికృష్ణ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. మోహన్ బాబు, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, దర్శకులు మారుతి, శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరోలు నాని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మంచు మనోజ్, అల్లరి నరేష్, రాణా దగ్గుబాటి, సిద్దార్ధ్, అల్లు శిరీష్, నటీమణులు సమంత అక్కినేని, మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, గౌతమి, రాధిక శరత్ కుమార్, నటులు శరత్ కుమార్, వెన్నెల కిషోర్, తదితరులు సోషల్ మీడియా ద్వారా ఈ దుర్ఘటనపై స్పందించారు.

మహేష్ బాబు హరికృష్ణగారి హఠాన్మరణం వార్త విని తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా బ్రదర్ తారక్, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. హరికృష్ణ గారి మరణవార్తవిని షాకయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... అని రామ్ చరణ్ ఫేస్ బుక్లో పోస్టు చేశారు.చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు... కొన్ని వారాల క్రితమే ఆయన నాతో అన్నారు. నన్ను కలవకుండానే వెళ్లిపోయారు. నాకు శూన్యంలోకి వెళ్లిపోయినట్లు ఉంది. నిన్ను మిస్ అవుతున్నాను అన్నా అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

హరికృష్ణగారి మరణవార్త విని నా గుండె ముక్కలైంది. నాకు, మా నాన్నకు ఆయనతో ఎంతో మంచి అనుబంధం ఉంది. స్వచ్ఛమైన వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కూరాలి. నా బ్రదర్ తారక్, కళ్యాణ్ రామ్, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... అంటూ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. నా సోదరుడు నందమూరి హరికృష్ణను కోల్పోయాను అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఇంతకు మించి నేను ఏమీ మాట్లాడలేను. నాకు తీరని లోటు ఇది.... అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. హరికృష్ణగారు రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం విని షాకయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని రకుల్ ట్వీట్ చేశారు.

 చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు..that’s what he said a few weeks ago and now he is gone.all I feel is a void,I will miss you Anna!!!! pic.twitter.com/T9epx3ZEEk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Harikrishna  Road accident  Jr  NTR  Kalyan Ram  Janaki Ram  tollywood  cine celebs  social media  

Other Articles