Kerala CM Urges Centre For Additional Help వరద ప్రభావితకు కేరళకు ఎమిరేట్స్ దేశాల భారీ సాయం..

Uae extends rs 700 crore assistance to help rebuild flood hit kerala

Kerala Floods, United Arab Emirates (UAE), UAE donation, UAE Support, kerala floods 2018, kerala rains, kerala floods, india, news, navy, rescue operations, kerala, Palakkad district, Thrissur district, pinarayi vijayan, Narendra Modi, Idukki district, Rahul Gandhi, appeals-people, contribute, CM's-relief-fund, crime

United Arab Emirates (UAE) has extended Rs 700 crore as financial assistance to rebuild flood-ravaged Kerala, Kerala chief minister Pinarayi Vijayan announced on Tuesday.

వరద ప్రభావితకు కేరళకు ఎమిరేట్స్ దేశాల భారీ సాయం..

Posted: 08/21/2018 10:46 PM IST
Uae extends rs 700 crore assistance to help rebuild flood hit kerala

కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈ అభివృద్దిలో భాగమైన లక్షలాధి మంది భారతీయులు మరీ ముఖ్యంగా వేలాది మంది కేరళవాసులు ఎన్నో ఏళ్లుగా ఏమిరేట్స్ అభ్యున్నతికి పాటుపాటుపడ్డారు. దీంతో కేరళ రాష్ట్రాన్ని ఆదుకుంటామని గతంలోనే ప్రకటించిన యూఏఈని భారీ సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది.

యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్.. తాజాగా తమ దేశం తరఫున ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారు. యూఏఈ ఓ దేశంగా విజయం సాధించడంలో కేరళ ప్రజల భాగస్వామ్యం మరచిపోలేమని ఆయన గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేరళకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా జాతీయ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మక్తూమ్ ప్రకటించారు.

యూఏఈ రూ.700 కోట్ల విలువైన సాయాన్ని ప్రకటించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. తమపై ఎంతో ప్రేమ చూపిన యూఏఈ ప్రభుత్వానికి, పాలకులకు విజయన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కేరళ వరదలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మొత్తం రూ.600 కోట్ల సాయం మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్షం ఈ రోజు సాయంత్రం తిరువనంతపురంలో భేటీ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles