Kerala battles fake news along with floods విషాదంలో విద్వేషమా.? సిగ్గుమాలిన చర్య

Indian army warns of fake video showing man wearing army uniform

Kerala Floods, fake news, social media rumours, army man imposter, army man fake news, kerala rains, kerala Landslides, Kerala

The Indian Army has issued a warning against a fake video in which a man wearing Army combat uniform is seen making statements against the way the Kerala Government is carrying out the flood rescue effort.

విషాదంలో విద్వేషమా.? సిగ్గుమాలిన చర్య

Posted: 08/20/2018 06:52 PM IST
Indian army warns of fake video showing man wearing army uniform

ఓ వైపు భారీ వర్షాలతో కేరళ అల్లాడుతుంటే.. అపదలో చిక్కుకున్న ఆర్తులను అదుకునేందుకు వారిని సురక్షితంగా సహాయ శిబిరాలకు చేర్చేందకు అపన్నహస్తం అందిస్తూ.. ముందుకు సాగుతున్న రియల్ హీరోస్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపేమో కొందరు దుండగులు విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్లు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా భారత ఆర్మీ యూనిఫాం ధరించిన ఓ యువకుడు కేరళ ప్రజలను తూలనాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘భారతీయ మహిళా మోర్చా తలస్సేరి’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి సైనిక దుస్తులు ధరించి మాట్లాడుతూ.. ‘భారత సైన్యంపై మీకు (కేరళ ప్రజలకు) ఎందుకంత ద్వేషం? మేం కేరళకు రావడం మీ మంత్రి కొడియారి బాలకృష్ణన్ కు ఇష్టం లేదా? చెంగన్నూర్ లో వేలాది మంది చిక్కుకుపోయారు. మమ్మల్ని మా పని చేయనివ్వండి. మేము మీ రాష్ట్రాన్ని ఆక్రమించుకోము. భయపడకండి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

ఈ వీడియో వైరల్ గా మారడంతో భారత ఆర్మీ వెంటనే స్పందించింది. కేరళలో ఆర్మీ చేపడుతున్న సహాయ కార్యకలాపాలపై ఓ మోసగాడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ట్వీట్ చేసింది. ఈ ఘటన వెనుక ఉన్నవారు ఎవరో తెలిస్తే వెంటనే తమ నంబర్ 917290028579 కి వారి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించింది. ప్రస్తుతం జవాన్లు కేరళలో సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Floods  fake news  social media  rumours  army man  imposter  Kerala  

Other Articles