Kofi Annan, former UN secretary general, dies సెలవంటూ తిరిగిరాని లోకాలకు.. ప్రపంచ శాంతికామకుడు

Kofi annan former secretary general of united nation dies at 80

kofi annan, kofi annan dead, kofi annan passes away, kofi annan life, kofi annan nobel peace winner, kofi annan united nations, kofi annan controversy, kofi annan tributes, kofi annan news, world

One of the world's most noted diplomats and a charismatic symbol of the United Nations, Annan, a native of Ghana, rose through its ranks to become the first black African secretary-general of the UN. The news of his death was announced by his foundation on Saturday.

సెలవంటూ తిరిగిరాని లోకాలకు.. ప్రపంచ శాంతికామకుడు

Posted: 08/18/2018 05:57 PM IST
Kofi annan former secretary general of united nation dies at 80

ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫి అన్నన్ (80) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్రఅస్వస్థతకు గురైన ఆయనను స్విట్జర్లాండ్ లోని అసుపత్రికి తరలించగా, చికిత్స పోందుతూ ఆయన తరలిరానీ లోకాలకు వెళ్లారని.. యూఎన్ మైగ్రేషన్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కోఫి అన్నన్ ఫౌండేషన్ ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చివరి రోజుల్లో భార్య నానే, పిల్లలు అమా, కోజో, నినా ఆయనతోనే ఉన్నారని తెలిపుతూ.. ఈ మేరకు ట్విట్టర్‌లో భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది.

ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రస్థానం వివిధ స్థాయుల నుంచి సెక్రటరీ జనరల్‌ స్ధాయి వరకూ సాగింది. సెక్రటరీ జనరల్‌‌గా 1997 నుంచి 2006 వరకు కోఫి అన్నన్ విధులు నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2001లో నోబెల్ శాంతి బహుమతి ఆయనను వరించింది. గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐరాస వలసల విభాగం ట్విటర్‌ ద్వారా అన్నన్ కు నివాళులర్పించింది. ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు ఏకంగా పదేళ్ల పాటు పదవిలో కొనసాగారు.

ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రపంచ శాంతి కోసం ఎంతగానో కృషి చేశారు. సమగ్రాభివృద్ధి, మానవ హక్కుల కోసం కూడా ఆయన పాటుపడ్డారు. ఐరాస నుంచి తప్పుకొన్న తర్వాత కూడా కోఫీ అన్నన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, నెల్సన్‌ మండేలా స్థాపించిన ది ఎల్డర్స్‌ గ్రూప్‌లో సభ్యుడిగా ప్రపంచ శాంతి కోసం తన వంతు కృషి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kofi annan  passes away  nobel peace winner  united nations  tributes  world  

Other Articles