indian convicted in america on molestation charges పరదేశీ యువతిని తడిమిన భారత ఐటీ మేనేజర్..

Indian it manager convicted on molestation charges in dertriot

Prabhu ramamoorthy, US flight sexual assault, US flight, Sexual assault, Indian IT manager, Prabhu Ramamoorthy, Sexual assault on flight, life imprisonment, IT company, Manager, sexual assault, molest charges, groping woman, US flight, spirit airlines, federal court, detriot court, los vegas, crime

A 35-year-old Prabhu Ramamoorthy, Indian IT manager has been convicted of sexually assaulting a sleeping woman aboard a Detroit-bound flight in the US, will be sentenced on December 12 by US District Judge Terrence Berg

సతి పక్కనుండగా, పరదేశీ యువతిని తడిమిన భారత ఐటీ మేనేజర్..

Posted: 08/18/2018 11:53 AM IST
Indian it manager convicted on molestation charges in dertriot

తన జీవితాన్ని పంచుకున్న భార్య పక్కన వుండగా ఏలాంటి మగాడైన అదుపాజ్ఞల్లో వుంటాడు. తన భార్యపై పర పురుషుల కన్ను పడకుండా తానే రక్షణగా నిలుస్తాడు. కానీ పరాయి దేశంలో తన భార్యను పక్కనే పెట్టుకుని.. పరదేశీ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధుడ్ని ఏమంటారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పోగడరా నీ తల్లి భూమి భారతని అంటూ చాటిన మన పెద్దల సూక్తులను, మంచి మాటలను కూడా లెక్కపెట్టకుండా పరాయి దేశంలో స్వదేశం పరువు తీసిన పైశాచిక మృగాన్ని అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది.

ఈ ఏడాది డిసెంబర్ 12న ఆయనకు మెచిగన్ లోని డెట్రాయిట్ ఫెడరల్ కోర్టు శిక్షను విధించనుంది. ఈ నేరంలో దోషిగా తేలిన భారత్ ఐటీ మేనేజర్ ప్రభు రామమూర్తికి జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశాలు వున్నాయని తెలుస్తుంది. శిక్ష పూర్తైన తరువాత ఆయనను భారత్ కు పంపించే అవకాశం వుంది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అగ్రరాజ్యంలోని డెట్రాయిట్ వెళ్లేందుకు లాస్ వెగాస్ లో విమానం ఎక్కిన భారత ఐటీ మేనేజర్ ప్రభు రామమూర్తితో పాటు ఆయన భార్య కూడా వెళ్లింది. అయితే తన పక్కన కిటీకీ వైపునున్న మరో సీటులో మరో 22 ఏళ్ల యువతి కూర్చొని వుంది.

విమానం బయలుదేరిన కాసేపటికి భార్య నిద్రకు ఉఫక్రమించిన తరువాత.. తన పక్క సీటులో వున్న పరదేశీ యువతిని లైంగికంగా వేధించాడు రామమూర్తి. యువతి కూడా నిద్రలోకి జారుకోవడంతో ఆమె రహస్యబాగాలను తాకాడు. అమె షర్టు బటన్లను ఊడదీని అమె రహస్య శరీర బాగాలను తడిమాడు. అంతేకాదు అమె ఫ్యాంటుకు వున్న బట్లను కూడా తొలగించి చేయితో తడిముతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ క్రమంలో తన వంటిపై ఎదో పాకుతున్నట్లు అనిపించిన యువతి మేల్కోని చూసే సరికి రామమూర్తి చేయకూడని పనులు చేస్తూ పట్టుబడగా, యువతి సదరు విమాన సిబ్బందికి విషయాన్ని చెప్పి అతన్ని పోలీసులకు అప్పగించేలా చేసింది.

ఈ ఘటన ఏడు నెలల క్రితంజరగ్గా విచారణ అనంతరం ఫెడరల్ న్యాయస్థానం ఇవాళ అతడ్ని దోషిగా తేల్చింది. డిసెంబరు 12న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. అమెరికాలోని రోచెస్టర్ హిల్స్‌లో ఉంటున్న రామమూర్తి మొదట తాను అమాయకుడినని, తానేం చేయలేదని బొంకినా.. ఎఫ్ బి అధికారులు విచారణలో మాత్రం తాను అమె షర్టు బటన్లు తొలగించి.. అసభ్యకరంగా అమె ఎదబాగాలను తాకానని అంగీకరించాడు. దీంతో మెచిగన్ లోని డెట్రాయిట్ ఫెడరల్ కోర్టు ప్రభు రామమూర్తిని దోషిగా తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles