Swami Agnivesh Attacked Near BJP Office In Delhi ఢిల్లీ బీజేపి ఆఫీస్ వద్ద స్వామి అగ్నివేశ్ పై దాడి..

Atal bihari vajpayee funeral swami agnivesh heckled assaulted

Atal Bihari Vajpayee, Swami Agnivesh, BJP office, last tributes, PM Modi, Amit Shah, Ram Nath Kovind, BJP office, new delhi, mob attack swami agnivesh, smriti sthal, LK Advani, last rites, Namitha Bharadwaj Amit Shah, krishna menon marg, last journey, Congress, Jawaharlal Nehru, Lal Bahadur Shastri, Mahatma Gandhi, atal bihari vajayee funeral, Atal Bihari Vajpayee, BJP, Mohan Bhagwat, Narendra Modi, Vajpayee, vajpayee death

Social activist Swami Agnivesh was assaulted on Deen Dayal Upadhyaya Marg in New Delhi. He was reportedly on his way to pay tribute to former prime minister Atal Bihari Vajpayee.

ITEMVIDEOS: ఢిల్లీ బీజేపి ఆఫీస్ వద్ద స్వామి అగ్నివేశ్ పై దాడి..

Posted: 08/17/2018 05:48 PM IST
Atal bihari vajpayee funeral swami agnivesh heckled assaulted

కవిగా, మానవతావాదిగా, అంతకుమించి నిష్కళంకుడైన రాజకీయ నేతగా, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మాజీ ప్రధాని, కమలదళ బీష్ముడు, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్ పేయి అంతిమ సంస్కారాల రోజున.. అక్కడకు జనసమూహం అధికంగా వున్నా.. వారందరినీ దాటుకుంటూ బీజేపి కేంద్ర కార్యాలయం వద్దకు చేరకున్న సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై కొందరు గుర్తు తెలియని అగంతకులు దాడికి పాల్పడ్డారు. ఆయన దారిని అడ్డుకుని మరీ వెనక్కి తొసుకుంటూ తీసుకువచ్చారు. ఆయన తలపాగా కూడా లాగి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు.

బీజేపి కేంద్ర కార్యాలయంలో ఉంచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పార్థీవ దేహానికి ఆయన తన నివాళులర్పించేందుకు నడుచుకుంటూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో వస్తుండగా, వెనుకగా వచ్చిన కొందరు గుర్తు తెలియని అగంతకులు ఆయనపై దాడి చేశారు. తనపై దాడి తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన తాను మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులు అర్పించేందుకు బీజేపి ఆఫీస్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నానని.. ఈ క్రమంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనపై దాడి చేశారన్నారు. దారుణంగా కొట్టారని, అసభ్యకరంగా దూషిస్తూ.. తన తలపాగాను లాగారని  ఆవేదన వ్యక్తం చేశారు.  

అగ్నివేష్  దేశద్రోహి అంటూ తనను చితకబాదినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావాలనే స్వామి అగ్నివేష్ పై దాడి చేయించారని మండిపడుతున్నారు బీజేపి కార్యకర్తలు. దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి, క్లీయర్ చేశారు. దాడి చేసినవారిని ఎలాగైనా పట్టుకుంటామని తెలిపారు పోలీసులు. కాగా, స్వామి అగ్నివేష్ పై దాడి జరగడం నెల రోజుల్లోనే ఇది రెండోసారి. జార్ఖండ్‌ లో కొద్ది రోజుల క్రితం బీజేపి కార్యకర్తలు స్వామి అగ్నివేష్‌ పై దాడి చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atal Bihari Vajpayee  Swami Agnivesh  BJP office  last tributes  PM Modi  Amit Shah  Politics  

Other Articles