AB Vajpayee final journey for Smriti Sthal begins మహానేత అంతిమయాత్ర.. జనసంధ్రంగా ఢిల్లీ వీధులు..

Atal bihari vajpayee final journey for smriti sthal begins

Atal Bihari Vajpayee, PM Modi, Amit Shah, smriti sthal, krishna menon marg, LK Advani, last journey, Congress, Jawaharlal Nehru, Lal Bahadur Shastri, Mahatma Gandhi, atal bihari vajayee funeral, Atal Bihari Vajpayee, BJP, Mohan Bhagwat, Narendra Modi, Vajpayee, vajpayee death

Atal Bihari Vajpayee final journey Live Updates: The funeral of former prime minister Atal Bihari Vajpayee, who died yesterday at the age of 93, will be held at Rashtriya Smriti Sthal in Delhi today at 4 pm.

మహానేత అంతిమయాత్ర.. జనసంధ్రంగా ఢిల్లీ వీధులు..

Posted: 08/17/2018 02:52 PM IST
Atal bihari vajpayee final journey for smriti sthal begins

మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్ పేయి అంతిమయాత్ర అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య కొనసాగుతోంది. ఢిల్లీలోని దీన్ దయాళ్‌ మార్గ్ లోని బీజేపి ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా, తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన ప్రజలతో ఢిల్లీ వీధులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమైన కమలదళ అధినాయకుడి అంతిమయాత్ర.. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వరకు కొనసాగనుంది.

వాజ్ పేయి అంతిమయాత్ర వెంట ప్రధాని నరేంద్రమోడీ కాలి నడకన వెంట నడుస్తుండగా, ఆయన పక్కన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటుగా మధ్యప్రధేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ఫ్రదేశ్, గోవా సహా పలు బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువుకు కేంద్రమంత్రులు కూడా కాలినడక రాష్ట్రీయ స్మృతిస్థల్ వద్దకు చేరుకుంటున్నారు. ప్రధాని సహా కేంద్రమంత్రులు అంతిమయాత్రలో కాలిబాటన నడుస్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అటు ఆర్మీ కూడా రంగంలోకి దిగి భద్రతా వ్యవహరాలను పర్యవేక్షిస్తుంది. భారత నావీకి చెందిన 23 ఐఏఎఫ్ ఛాపర్లు, 11 విమానాలను కూడా భద్రతా పర్యవేక్షణ కోసం వినియోగిస్తున్నారు.

కాగా మరికాసేపట్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో వాజ్ పేయి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. భారత జాతికి విశేష సేవలందించిన వాజ్ పేయి ఇక యమునా నదీ తీరాన సేద తీరనున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు విదేశీ నేతలు తరలివచ్చారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌, నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, గ్యావల్, శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కిరిల్లా, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌ సైతం వాజ్‌పేయి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వీరందరికీ భారత విదేశాంగశాఖ అధికారులు స్మృతి స్థల్ వద్దకు తరలించారు. అక్కడ వారు అటల్ జీ అంత్యక్రియల్లో పాల్గోనున్నారు.

నెహ్రూ స్మారక స్థలం శాంతి వనం, లాల్ బహుదూర్‌ శాస్త్రి స్మారకం విజయ్‌ ఘాట్‌ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్‌ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్‌లోనే జరిగాయి. అక్కడ ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని గతంలో కేంద్రప్రభుత్వం అదేశాలను జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను తాజా పరిణామాల నేపథ్యంలో సవరించి.. అటల్ బిహారీ వాజ్ పేయ్ కి స్మారక స్థూపంతో పాటు భవనాన్ని నిర్మించేందుకు కేంద్రక్యాబినెట్ అమోదం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atal Bihari Vajpayee  PM Modi  Amit Shah  smriti sthal  krishna menon marg  LK Advani  last journey  

Other Articles