Vajpayee broke into tears ఆ జర్నలిస్టు ప్రశ్న విని కంటనీరు పెట్టిన వాజ్ పేయి..

Atal bihari vajpayee wept before he took oath as pm

Atal Bihari Vajpayee, Rajiv shukla, PM, Oath taking, Atal Bihari Vajpayee, Rajiv Shukla, Congress, Jawaharlal Nehru, Lal Bahadur Shastri, Mahatma Gandhi, atal bihari vajayee funeral, Atal Bihari Vajpayee, BJP, krishna menon marg, Mohan Bhagwat, Narendra Modi, Vajpayee, vajpayee death

Former journalist and Senior Congress leader Rajiv Shukla recalls that Vajpayee wept during an interview with him, on the eve of him taking oath as the prime minister, at the thought of having to stay away from the public.

ఆ జర్నలిస్టు ప్రశ్న విని కంటనీరు పెట్టిన వాజ్ పేయి..

Posted: 08/17/2018 02:09 PM IST
Atal bihari vajpayee wept before he took oath as pm

పది పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. నిత్యం ప్రజల్లో వుంటూ.. వారిని చైతన్యపరుస్తూ వుండేవారన్న విషయం తెలిసిందే. జనసంఘ్ పార్టీని స్థాపించి ఆనంతరం అద్వానీతో కలసి భారతీయ జనతా పార్టీని స్థాపించిన ఆయన.. రెండు స్థానాలతో పార్లమెంటులో అడుగుపెట్టి.. అక్కడి నుంచి ఏకంగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వరకు పోరాడారంటే ఆయన ప్రసంగాలతో ప్రజలు ఎలా సమ్మెహనులయ్యేవాళ్లో.. ఆయన వాగ్ధాటికి ఎలా అప్పటి యువతరం ఉప్పోంగిపోయేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే అలాంటి ప్రధానిలో తాను సామాన్య ప్రజలకు దూరం కానున్నానని, తన చుట్టూ ఓ వలయం నిర్మితం కానుందని తెలిసిన తరువాత భావోద్వేగానికి గురై కంట కన్నీరు పెట్టుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో మాజీ జర్నలిస్టు, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా అడిగిన ప్రశ్న విని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజీవ్ శుక్లా స్వయంగా గుర్తు చేసుకుంటూ, "నేను వాజ్ పేయిని 1996లో ఇంటర్వ్యూ చేశాను. ఆయన ప్రధాని కాబోతున్న వేళ ఇది జరిగింది. మీరు ప్రధాని కాబోతున్నారు. రేపటి నుంచి మీ చుట్టూ భద్రతా వలయం ఏర్పడుతుంది. మీరు ఇక ప్రజలను దూరం నుంచి కలవాల్సిందే.... అని అంటుండగా, ఆయన ఏడుపు ప్రారంభించారు. తనకు ప్రజలు దూరమవుతారన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపించింది" అని అన్నారు.

ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు కూడా సౌకర్యవంతంగా కనిపించేవని, కక్షపూరిత చర్యలకు ఆయన వ్యతిరేకమని, అందువల్లే ఆయనంటే ఎంతో మందికి ప్రేమని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. సమకాలీన రాజకీయ నేతలతో పోలిస్తే, ఆయన ఆలోచనా ధోరణి విభిన్నమైనదని చెప్పారు. నేటి తరం నేతలు ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాల్సివుందని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాల్లోని మంచి లక్షణాలను అందిపుచ్చుకుని ఎదిగిన వాజ్ పేయి, గొప్ప వక్తని కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles