ATM dispensing Rs 2500 on asking 500 ఆ హెచ్డీఎఫ్సీ ఏటీయం వద్ద డబ్బుల కోసం క్యూ.. ఎందుకంటే..

Atm dispensing rs 2500 on asking 500

ATM dispensing more cash, HDFC ATM dispensing cash , HDFC ATM Vengalrao nagar, Hyderabad, Telangana

HDFC ATM centre at vengalrao nagar in Hyderabad is dispensing Rs 2500 on asking 500, locals from the surrounding area rushed to the ATM to get Extra Money.

ఆ హెచ్డీఎఫ్సీ ఏటీయం వద్ద డబ్బుల కోసం క్యూ.. ఎందుకంటే..

Posted: 08/10/2018 10:54 AM IST
Atm dispensing rs 2500 on asking 500

నవంబర్ 8, 2016లో పెద్దనోట్ల రద్దు తరువాత ప్రజలు డబ్బు కోసం ఎంతో ఇబ్బందులు పడి.., అర్థిక ఎమర్జెన్సీని పరస్థితిని తలచుకుని కొందరు అనేక కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో ఏప్రిల్ తరువాత కొత్తగా వచ్చిన రెండు వేలు. ఐదువందల నోట్లను తీసుకునేందుకు బారులు తీరిన ప్రజలకు కొన్ని ఏటీయం కేంద్రాలు అధిక మొత్తంలో డబ్బులను వితరణ చేశాయి. అడిగిన దాని కంటే అధికంగా డబ్బులను ఇచ్చిన ఏటీయం కేంద్రాలపై అప్పట్లో బ్యాంకు అధికారులు తమ సిబ్బందితో మరమ్మత్తులు చేయించిన తరువాత కానీ వినియోగంలోకి తీసుకురాలేదు.

ఇక తాజాగా హైదరాబాద్ లోని హెచ్.ఢీ.ఎఫ్.సీ బ్యాంకులో కూడా అదే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఈ ఏటీయం కేంద్రంలోంచి డబ్బులు తీసుకునేందుకు స్థానికలు భారీగా క్యూకట్టారు. నిజమా అంటే ఔననే సమాధానమే వస్తుంది. విషయంలోకి ఎంటర్ అయితే.. హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ లో ఉన్న హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు ఏటీఎంకు వద్దకు డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు పోటెత్తారు. రూ.500 డ్రా చేస్తే ఏకంగా రూ.2500 వస్తుండడంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు స్థానికులు పోటెత్తారు.

పెద్ద ఎత్తున నగదు డ్రా చేసుకుని వెళ్లారు. ఈ వార్త కాస్తా వైరల్ అయి విషయం హెచ్‌డీఎఫ్‌సీ అధికారులకు చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మిషన్‌ను సరిచేసేందుకు నిపుణులను పంపారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగినట్టు గుర్తించిన బ్యాంకు అధికారులు డబ్బులు డ్రా చేసుకున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATM  HDFC ATM  Vengalrao nagar  Hyderabad  Telangana  

Other Articles

Today on Telugu Wishesh